ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం క్రెడిట్ వార్‌(credit war) జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం క్రెడిట్ వార్‌(credit war) జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబునాయుడు(Chandrababu4) నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. కూటమి సర్కారుకు భారీ విజయం రావడం వెనుక ఘనతంతా తమదేనని, కాదు కాదు ఆ క్రెడిట్‌ అంతా తమదేనని కూటమిలో లోలోపల తన్నులాటలు జరుగుతున్నాయి. గుద్దులాటలు జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి రావడానికి మేం కారణమంటే మేము కారణమని చెప్పుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. విజయానికి ఫాదర్స్‌ ఎక్కువ. పరాజయం అనాధ అంటుంటారు కదా! అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయానికి ఫాదర్స్‌ ఎక్కువయ్యారు. అలాంటి ఫాదర్స్‌ కూటమిలో తమకు కావాల్సింది తమకు రావడం లేదనో, తమకు దక్కాల్సింది తమకు దక్కడం లేదనో అసంతృప్తులు, అలకలతో ఉన్నారు. ఒకసారి కూటమి అధికారంలోకి రావడానికి సంబంధించిన క్రెడిట్ తీసుకుంటున్నవారు తామే అధికారంలోకి తెచ్చామని చెబుతున్నవారి గురించి ఓసారి చెప్పుకుందాం! ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ప్రతిపక్షంగా భావించింది, ఆయనను తమ ప్రత్యర్థిగా అనుకున్నది ఒక్క తెలుగుదేశంపార్టీ మాత్రమే కాదు, అక్కడున్న మీడియా కూడా ! వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి కూడా ప్రతి సందర్భంలో బహిరంగ సభలలో కావచ్చు, మీడియాను అడ్రస్‌ చేస్తున్నప్పుడు కావచ్చు అందరిని కలిపే మాట్లాడుతుండేవారు. చంద్రబాబునాయుడుతో పాటు అక్కడున్న మీడియా సంస్థల పేర్లను ప్రస్తావిస్తూ వారంతా తమ ప్రత్యర్థులు అని ఆయన చెప్పేవారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్‌రెడ్డి ఎవరినైతే టార్గెట్‌ చేశారో వారంతా మీడియాను పక్కన పెట్టి జగన్‌పై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇలాంటి మీడియా సంస్థలలో ప్రథానమైనది ఆంధ్రజ్యోతి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయిదేళ్ల పాటు రకరకాల వార్తలను వండి వార్చింది. రకరకాల చర్చలతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూటగట్టిందన్నది ఆ సంస్థ అభిప్రాయపడుతోంది. జగన్‌ ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో చేసిన ఒక్క మంచి కూడా లేదంటూ, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందటూ, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందంటూ చాలా పెద్ద ఎత్తున టీవీ ద్వారా, పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. అలాగే టీవీ 5 కూడా జ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది, ఏడాదిన్నర కాలం తెలుగుదేశం పార్టీ కెందిన అధికార చానెల్‌గా మారిపోయింది. తెలుగుదేశంపార్టీ కనుసన్నల్లోనే నడిచింది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. నారా లోకేశ్‌ గైడెన్స్‌తోనే ఆ చానెల్ నడిచిందన్నది తెలిసిన విషయమే! ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడానికి వెనుక తమ పాత్ర గణనీయంగా ఉందని ఈ రెండు మీడియా సంస్థలు చెప్పుకుంటున్నాయి. అదే సమయంలో ఈనాడు పత్రిక గురించి చెప్పాలి. ఈనాడు కూడా జగన్‌కు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసింది. కూటమి అధికారంలోకి రావడం వెనుక తమ పాత్రను విస్మరించడానికి వీల్లేదని అంటోంది ఈనాడు. ఇది మీడియాకు సంబంధించిన విషయం. ఇక రాజకీయపార్టీల విషయానికి వస్తే జనసేన పార్టీని ముందుగా చెప్పుకోవాలి. పవన్‌ కల్యాణ్‌ లేకపోతే కూటమి ఏర్పడేదే కాదు అని స్వయంగా చంద్రబాబునాయుడే పలు సందర్భాలలో చెప్పారు. పవన్‌కల్యాణ్‌ లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయేవి. జగన్మోహన్‌రెడ్డికి లాభం చేకూరేది. కాబట్టి పవన్‌ కల్యాణ్‌ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అసలు పవన్‌ కల్యాణ్‌ కల్పించుకోకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడేదే కాదు. నారా లోకేశ్‌ పాదయాత్ర కూడా కూటమి విక్టరీలో తన వంతు పాత్రను పోషించింది. లోకేశ్‌ పాదయాత్ర తర్వాత టీడీపీ క్యాడర్‌లో ఉత్సాహం వచ్చింది. ధైర్యం వచ్చింది. ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇలా చాలా మంది ఎవరికి వారు కూటమి అధికారంలోకి రావడానికి తామే కారణమని చెప్పుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story