రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌,‌‌ ఐఏఎస్‌‌ అధికారి అమోయ్‌‌కుమార్‌(Amoy kumar)‌‌‌ చుట్టూ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ED) ఉచ్చు బిగుస్తున్నది.

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌,‌‌ ఐఏఎస్‌‌ అధికారి అమోయ్‌‌కుమార్‌(Amoy kumar)‌‌‌ చుట్టూ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ED) ఉచ్చు బిగుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌గా(collector) ఉన్న సమయంలో భూకేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డట్టు అమోయ్‌‌కుమార్‌‌‌‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి.

ఈ నెల 22న విచారణకు రావాలని అమోయ్​కుమార్​కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్నది అభియోగం. ఆ రోజు తనకు వీలుకాదని ఆయన తెలిపినట్టు సమాచారం. అయితే, 23న విచారణకు హాజరుకావాలని అమోయ్​కుమార్​కు ఈడీ అధికారులు సూచించారు. అమోయ్‌కుమార్‌ యువ ఐఎఎస్‌ అధికారి. తెలంగాణలో అత్యంత కీలకమైన బాధ్యతలను చేపట్టిన వ్యక్తి. హైదరాబాద్‌ చుట్టుపక్కల విలువైన భూములు ఉన్న ప్రాంతాలలో కలెక్టర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆరోపణ. నిజానికి అమోయ్‌కుమార్‌కు చెందిన బాధితులు హైదరాబాద్‌ నగరం చుట్టూ అనేక మంది ఉన్నారు. ఒక ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఎలా ఉండకూడదో అనేదానికి అమోయ్‌కుమార్‌ ఒక ఉదాహరణ. అమోయ్‌కుమార్‌ లాంటి వ్యక్తులు ఐఎఎస్‌లుగా ఎలా సెలక్టయ్యారనేది ఆశ్చర్య కలిగిస్తున్నది. హైదరాబాద్‌ చుట్టుపక్కల అనేక మంది పేదల కన్నీళ్లకు కారణమయ్యారు అమోయ్‌కుమార్‌!

Eha Tv

Eha Tv

Next Story