Congress : వీవీ ప్యాట్ల వెరిఫై... కాంగ్రెస్ పోరాటం !
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు(Maharashtra elections) కాంగ్రెస్ పార్టీకి(Congress party) షాక్ ఇచ్చాయి!
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు(Maharashtra elections) కాంగ్రెస్ పార్టీకి(Congress party) షాక్ ఇచ్చాయి! ఆ షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతున్నది. లోక్‌సభ ఎన్నికల(Loksabha elections) తర్వాత తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెల్చుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను సాధించింది. 2019తో పోలిస్తే మెరుగైన ఫలితాలనే రాబట్టుకుంది. ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్యారంటీగా గెలుస్తామని అనుకుంది కాంగ్రెస్! సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ మాటే అన్నాయి. జమ్ము కశ్మీర్‌లో కూడా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపాయి. అయితే హర్యానాలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసింది. హర్యానాలో బీజేపీ(BJP) గెలవడమన్నది కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌నిచ్చింది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ మొదలయ్యింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తూ బీజేపీ గెలుస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలపై సందేహపడింది. బ్యాలట్(Ballet) ద్వారానే ఎన్నికలు జరపాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది. ఈ ఎన్నికలను తాము గుర్తించడం లేదంటూ కామెంట్ చేసింది. ఎన్నికల కమిషన్‌కు ఓ లేఖ కూడా రాసింది కాంగ్రెస్. రాయడమే కాదు ఈవీఎంలకు(EVM) సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్ విషయాన్ని లేవనెత్తింది. ఛార్జింగ్ తక్కువగా ఉన్న చోట్ల ఒకరకమైన ఫలితం, చార్జింగ్ ఎక్కువ ఉన్న చోట మరో రకమైన ఫలితం రావడాన్ని ఆధారాలతో సహా చూపించింది. ఎన్నికల సంఘం(Election commission) దీనికి కొట్టిపారేసింది. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమాతో కాంగ్రెస్ ఉండింది. అయితే కాంగ్రెస్ కూటమి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. కచ్చితంగా గెల్చుస్తామని అనుకున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు మింగుడుపడనివ్వడం లేదు.