తిరుమల లడ్డూ(Tirumala) వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఓ నిజం చెప్పారు.

తిరుమల లడ్డూ(Tirumala) వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఓ నిజం చెప్పారు. లడ్డూలో(Laddu) ఏదో కలిసిందని ఇప్పటి వరకు హిందు సమాజం ఆందోళన, హిందువులు ఆందోళన చెందుతూ వచ్చారు. అసలు లడ్డూ వివాదంపై అధికార తెలుగుదేశంపార్టీ(TDP), ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటారు. నిందలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు తిరుపతి లడ్డూ విషయంలో ఏది వాస్తవం అన్నది ప్రజలకు తెలియకుండా పోయింది. శనివారం చంద్రబాబు మీడియా ముందుకొచ్చి మాట్లాడిన మాటలు చూస్తే హిందువులు ఎవరూ లడ్డూ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిపిస్తోంది. తిరుమలకు ఎనిమిది నెయ్యి టాంకర్లు వచ్చాయని, అందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోనే కల్తీ జరిగిందని గుజరాత్‌కు చెందిన ల్యాబ్‌ అనుమానపడుతూ ఓ రిపోర్ట్ ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆ నాలుగు ట్యాంకర్లను టీటీడీ వాడనేలేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఈ మాట అన్న తర్వాత తిరుమల లడ్డూ అపవిత్రమైపోయిందన్న వాదనలో పసే ఉండదు. గతంలో టీటీడీ ఈవో శ్యామలరావు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయినప్పటికీ కూటమి నేతలు లడ్డూలో వాడిన నెయ్యిలో ఏదో కలిసిందని ప్రచారం చేశారు. భక్తుల్లో ఆందోళన రేకెత్తించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆధారాలతో సహా వాస్తవాలు చెప్పినా , తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, బీజేపీ నాయకులు తప్పు జరిగిందంటూ తెగ ప్రచారం చేశారు.


Updated On 29 Sep 2024 6:08 AM GMT
Eha Tv

Eha Tv

Next Story