CM Chandrababu : దేశవ్యాప్తంగా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(Cm chandrababu) దేశ వ్యాప్తంగా ఓ ఇమేజ్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(Cm chandrababu) దేశ వ్యాప్తంగా ఓ ఇమేజ్ ఉంది. యునైటెడ్ ఫ్రంట్ సమయంలో దేశ ప్రధానమంత్రులను నిర్ణయించిన నాయకుడని ఇప్పటికీ అనుకుంటుంటారు. ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలన్నది అప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకే జరిగిందనే ప్రచారం ఉంది. తర్వాత కూడా అనేక సందర్భాలలో ముఖ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ(Narendra modi) ఉన్న సమయంలో అక్కడ జరిగిన దమన కాండకు సంబంధించి కేంద్రంలో ఉన్న వాజపేయి ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారంటూ దేశ వ్యాప్తంగా మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. చంద్రబాబును కలవడం కోసం గుజరాత్ ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ , ఏపీ భవన్ చుట్టూ చక్కర్లు కొట్టారంటూ వార్తలు వచ్చాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీతో కలిసి పని చేసినప్పుడు కూడా జాతీయస్థాయిలో చంద్రబాబు విస్తృత ప్రచారం లభించింది. మోదీతో విభేదాలు వచ్చి, ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియా అటెన్షన్‌ను డ్రా చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీయేలో(NDA) భాగస్వామి అయ్యారు చంద్రబాబు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అందుకు కారణం చంద్రబాబు, నితిష్‌కుమార్‌లేనని(Nitish kumar) మీడియా అప్పట్లో రాసింది కూడా! మొత్తంమీద ప్రాంతీయపార్టీలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నవారికి చంద్రబాబు ఒకరు. జయలలిత(Jayalalitha), మమతా బెనర్జీ(MAmatha banarjee), ములాయం సింగ్ యాదవ్, కరుణానిధి, లాలూ ప్రసాద్‌లు కూడా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పినవారే అయినప్పటికీ చంద్రబాబు వీరందరికంటే ఎక్కువ ఇమేజ్ తెచ్చుకున్నారు. గత పాతికేళ్లుగా చంద్రబాబు జాతీయ రాజకీయాలలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం కూడా చూశాం. అలాంటిది మొదటిసారి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి మాట్లాడిన మాటలు నేషనల్ మీడియాలో పెద్ద వార్తగా వచ్చింది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తులు కూడా చంద్రబాబు మాటలను నమ్మారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పారంటే లడ్డూలో ఏదో కలిసే ఉంటుందని అనుకున్నారు. ఆవేదన చెందారు. తెలుగురాష్ట్రాలలోని ప్రజలలో కొందరు చంద్రబాబు చెప్పింది నమ్మాలా వద్దా అని ఆలోచించుకున్నారు. లడ్డూపై చర్చ కూడా జరిగింది. కానీ జాతీయ స్థాయిలో మాత్రం చంద్రబాబు చెప్పినదే హైలైట్ అయ్యిందే తప్ప, ఇంకో కోణాన్ని ఆలోచించలేదు. చంద్రబాబు చెప్పారు కాబట్టి దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. గృహిణులు, మధ్యతరగతి వారు, పిల్లలు లడ్డూలో ఏదో జరిగే ఉంటుందని అనుకున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లడ్డూ విషయంలో చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారు. చంద్రబాబు ఎందుకిలా మాట్లాడి ఉంటాడా అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇక ముందు చంద్రబాబు ఏం మాట్లాడినా పట్టించుకునే అవసరం లేదనే భావన వచ్చేసింది. రాజకీయపరమైన వ్యాఖ్యలు బోల్డన్నీ చేయవచ్చు. తర్వాత మాట మార్చుకోవచ్చు. తాను అలా అనలేదని బుకాయించవచ్చు. కానీ భగవంతుడికి సంబంధించి, భక్తికి సంబంధించి, శ్రీవారి ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు ఈ రకమైన అబద్ధాలు ఎందుకు ఆడారన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.