Brother Anil : టీడీపీ, బీజేపీలను ఇరికించిన బ్రదర్ అనిల్!
తెలుగు రాష్ట్రాలలో బ్రదర్ అనిల్ కుమార్(Brother Anil kumar) అంతో ఇంతో తెలిసినవారే! వై.ఎస్.షర్మిలారెడ్డి(YS sharmila) భర్తగా ఆయన ప్రజలకు తెలుసు.
తెలుగు రాష్ట్రాలలో బ్రదర్ అనిల్ కుమార్(Brother Anil kumar) అంతో ఇంతో తెలిసినవారే! వై.ఎస్.షర్మిలారెడ్డి(YS sharmila) భర్తగా ఆయన ప్రజలకు తెలుసు. ఇప్పుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), వై.ఎస్.షర్మిల మధ్యన ఆస్తుల పంచాయితీ(assets dispute) జరుగుతున్నది కదా! ఈ క్రమంలో బ్రదర్ అనిల్‌కుమార్ తొలిసారిగా ఆ గొడవకు సంబంధించి మాట్లాడారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. జగన్మోహన్‌రెడ్డి న్యాయంగా, చట్టప్రకారం షర్మిలకు రావాల్సిన ఆస్తులను ఇవ్వడం లేదని అనిల్ అంటున్నారు. ఇంకా చాలా అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ జగన్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. వై.ఎస్.షర్మిలారెడ్డికి జగన్ అన్యాయం చేశారంటూ అనిల్ చెబుతున్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(Rajashekar reddy) సంపాదించిన ఆస్తులు నలుగురు పిల్లలకు సమానంగా చెందుతాయన్నది షర్మిల చెబుతున్నమాట! విజయమ్మ కూడా తాజాగా రాసిన లేఖలో ఇదే మాట అన్నారు. ఆస్తుల పంపకం అంశానికి సంబంధించి జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ ఆయనకు తెలియకుండానే తెలుగుదేశంపార్టీ(TDP), బీజేపీ(BJP), జనసేన(Janasena) పార్టీలను ఇరికించేశారు. 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను కూడా కారణమని , మొత్తం క్రిస్టియన్(Cristian) సంఘాలను, క్రిస్టియన్లను అందరినీ ఆర్గనైజ్ చేశానని, ప్రార్థనలు చేశానని బ్రదన్ అనిల్‌కుమార్ చెప్పుకొచ్చారు. ఏడో సంఖ్య తనకు లక్కీ నంబర్ అని, అందుకే దేవుడు 151 సీట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించేలా చేశాడని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించకూడదని తనపైన జగన్ ఆంక్షలు పెట్టారని అనిల్‌కుమార్ ఆరోపించారు. అలాంటి ఆంక్షలు పెట్టడం కారణంగా తాను ఆంధ్రప్రదేశ్‌లో క్రిస్టియన్ మత ప్రచారం కూడా చేయలేకపోయానని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో క్రిస్టియన్ మీటింగ్స్ జరగకపోవడానికి వెనుక, బ్రదర్ అనిల్ కుమార్ సభలు సమావేశాలు నిర్వహించకపోవడం వెనుక, క్రిస్టియన్‌ల సభలలో అనిల్ పాల్గొనకపోవడం వెనుక జగన్మోహన్‌రెడ్డి ఉన్నారనేది అనిల్ చెబుతున్న మాట! 'నాకు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాలు జరిపితే బీజేపీకి కోపం వస్తుంది' అని జగన్ తనతో చెప్పారని అనిల్ అన్నారు. ఇది జరిగిందెప్పుడంటే జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పదే పదే చెబుతున్న మాటేమిటి? ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించాయి. హిందూ దేవాలయాలపై జగన్ దాడులు చేయిస్తున్నారని అపనింద వేశాయి. హిందు దేవతామూర్తులను జగన్ ధ్వంసం చేయిస్తున్నారనే అభియోగాన్ని మోపారు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో క్రిస్టియానిటీ పెరిగింది. ఇలాంటి చవకబారు ఆరోపణలన్నీ కూటమి పార్టీలు చేశాయి. బీజేపీ, జనసేన పార్టీల కంటే తెలుగుదేశం పార్టీనే ఈ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అనిల్ వ్యాఖ్యల తర్వాత కూటమి పార్టీలు చేసిన ఆరోపణలన్ని పచ్చి అబద్ధాలని తేలిపోయింది.