Balineni Srinivas reddy : జనసేనలోకి బాలినేని.. కానీ అడ్డుపడుతున్నది ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌లో బాలినేని(Balineni) వ్యవహారం 'సాగుతూ..నే' ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బాలినేని(Balineni) వ్యవహారం 'సాగుతూ..నే' ఉంది. ఓ టీవీ సీరియల్‌ను తలపించేలా ఉంది. ఎన్నికల తర్వాత ఈవీఎంలపై బాలినేని పోరాడుతున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు చెందిన లెక్కలు తేలాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆదేశాల ప్రకారం ఈవీఎంలు, వీవీప్యాట్లు లెక్కించాలని గట్టిగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(Balineni srinivas reddy) పట్టుబట్టారు. అయితే ఎన్నికల కమిషన్ ఆయా ప్రాంతాల్లో మాక్ పోలింగ్ చేపడుతుందని చెప్పడంతో.. లేదు.. కాదు.. వీవీప్యాట్లు, ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించాలని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నేను ఒంటరిగా ఇంతగా పోరాడుతుంటే పార్టీ నుంచి తనకు సరైన సపోర్ట్ రావడంలేదని ఆయన బాహాటంగానే వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల కింద వైసీపీ అధినేత జగన్‌ను కూడా కలిసి చర్చించారు. సుదీర్ఘంగా తాను చెప్పదల్చుకుంది జగన్‌కు చెప్పి వచ్చేశారు. అయినా బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలినేని పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభమైంది. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జనసేనలోకి(Janasena) వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే బాలినేని జనసేనలో చేరడాన్ని మరో పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని సమాచారం.. ఎవరా నేతలు.. జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ విశ్లేషణలో