AP DGP Orders : V.Rలో సివిల్ సర్వెంట్లు.నష్టం ఎవరికి?
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) దాదాపు రెండు డజన్ల మంది సివిల్ సర్వెంట్లను(Civil servants VR) వీఆర్‌లో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) దాదాపు రెండు డజన్ల మంది సివిల్ సర్వెంట్లను(Civil servants VR) వీఆర్‌లో ఉంచారు. ఈ రెండు డజన్ల మంది సివిల్ సర్వెంట్లు గడచిన అరవై రోజులుగా వీఆర్‌లో ఉన్నారు. వీరు వీఆర్‌లో ఉన్న క్రమంలో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఐపీఎస్(IPS) అధికారులకు డీజీపీ(DGP) నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలోనే డజన్ మందికి పైగా ఐపీఎస్ అధికారులు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలో కూర్చోవాల్సి ఉంటుంది. వీఆర్‌లో ఉన్న సిబ్బంది ఆయా కార్యాలయాలలో రిపోర్ట్ చేయడం సర్వ సాధారణమైన విషయమే! సీఐ స్థాయిలో ఉన్నవారు కానీ, ఎస్‌ఐ స్థాయిలో ఉన్నవారు కానీ వీఆర్‌లో ఉన్నప్పుడు వారు డ్యూటీకి వెళ్లరు. రెగ్యులర్‌గా వెళ్లకపోయినా మళ్లీ పోస్టింగ్ వచ్చేవరకు వీఆర్‌లోనే ఉంటారు. కొంత మంది కార్యాలయాలకు వెళ్లి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఐపీఎస్ అధికారులు కూడా వీఆర్‌లో ఉన్నప్పుడు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జనరల్‌గా ఐపీఎస్‌లను ఎక్కువ కాలం వీఆర్‌లో ఉంచరు. ఎందుకంటే వీరి సేవలు అవసరం. ఉత్తినే ఎవరూ వీరిని కూర్చోపెట్టరు. ఇప్పుడు ఆ 24 మంది జీతభత్యాలను ప్రజలే భరిస్తున్నారు. ఇప్పుడు రెండు నెలలుగా వీరంతా ఖాళీగా ఉన్నారంటే డబ్బు వృధా అయినట్టే కదా! ఎందుకు వీరిని వీఆర్‌లో పెట్టాల్సి వచ్చిందంటే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వీరందరూ కీలక పోస్టులలో ఉన్నారు. ఆ సమయంలో తెలుగుదేశంపార్టీకి చెందిన వారిపై కేసులు పెట్టారని, వేధించారని, వైసీపీకి(YCP) అనుకూలంగా పని చేశారని విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ(TDP) ఆరోపిస్తూ వచ్చింది. లోకేశ్(lokesh) తన రెడ్‌బుక్‌లో(Redbook) వీరందరి పేర్లను రాసుకున్నారు.