అప్పులకు(Debts) సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధంగా ఉంటున్నాయి.

అప్పులకు(Debts) సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధంగా ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అప్పులపైన ఎన్నికల(ELections) ముందు కూటమికి చెందిన నాయకులు తోచిన అంకెలు చెబుతూ వచ్చారు. జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాల తీయించారని విమర్శించారు. కూటమికి చెందిన ముఖ్య నేతలంతా ఎన్నికల ప్రచారంలో ఇదే మాటను పదే పదే చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం జగన్‌(YS Jagan) ప్రభుత్వం చేసిన అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే! పార్లమెంట్‌లోనే ఈ మాట చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఏడు లక్షల కోట్ల రూపాయలనే అంటున్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రాని పెట్టినప్పుడు కూడా చంద్రబాబునాయుడు పది లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. ఇప్పుడు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నదని చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర అప్పు పది లక్షల కోట్ల రూపాయలు దాటి ఉండటంతో తాము కొత్తగా అప్పులు చేయడానికి వీలు లేకుండా పోయిందని బాధపడ్డారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్న మాటలు చాలా మందికి గురర్తుండే ఉంటాయి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ తాము సూపర్‌సిక్స్‌ గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎలా చేస్తారని అడిగితే తాము సంపదను సృష్టిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పదే పదే పది లక్షల కోట్ల రూపాయల అప్పు అని చెప్పసాగారు. ఇప్పుడు మనకు అప్పు దొరికే పరిస్థితి కూడా లేదని, సూపర్‌సిక్స్‌ అమలు చేయడం కష్టంగా ఉందని, అయినా సరే అమలు చేస్తామని చెప్పసాగారు. నిజానికి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నా సరే, పథకాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుటు పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది కాబట్టి తాము కొత్తగా అప్పు చేయడానికి వీలులేకుండా పోతున్నది అంటూ చంద్రబాబు చెప్పడం పూర్తిగా అసంబద్ధంగా ఉంది. ఇది పచ్చి అబద్ధం. అబద్ధం అని ఎందుకు చెబుతున్నానంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంద రోజుల పాలనలో ప్రతి మంగళవారం బాండ్ల పేరిట రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తూనే వస్తున్నది కూటమి ప్రభుత్వం. మరో అయిదు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. తాజాగా ప్రపంచబ్యాంక్‌ అమరావతి నిర్మాణం కోసమని 15 వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తున్నదని వార్తలు వస్తున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story