పోలీసులకు ఖరీదైన లాయర్లు .

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) ప్రభుత్వం ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు(Chandrababu) ఇంటిపైన అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేశ్‌(Jogi ramesh) దాడికి దిగారనే అభియోగంపైన ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలుగుదేశంపార్టీ(TDP) ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే కదా! చంద్రబాబునాయుడు ఇంటి దగ్గరకు జోగి రమేశ్‌ తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఆ సందర్భంగా దాడికి దిగారు అంటూ తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. ఈ అంశానికి సంబంధించి కేసు నమోదయ్యింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఆ సమయంలో తాను దాడికి వెళ్లలేదని, చంద్రబాబునాయుడుతో మాట్లాడటానికి, ఆయనతో చర్చించడానికి, చంద్రబాబునాయుడుకు ప్రభుత్వం ఏమి చేస్తున్నదో చెప్పడానికి మాత్రమే తాను వెళ్లానని జోగి రమేశ్‌ అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆయనపై తగు చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రమేశ్‌కు నోటీసులు ఇచ్చి పిలిపించారు కూడా! విచారణకు హాజరైన సందర్భంగా ఆయన వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakr Reddy) కూడా ఉన్నారు. జోగి రమేశ్‌ కేసును వాదిస్తున్నది సుధాకర్‌రెడ్డినే! జోగి రమేశ్‌కు బదులుగా అన్ని ప్రశ్నలకు సుధాకర్‌రెడ్డినే సమాధానాలు చెబుతున్నారంటూ పోలీసుల తరఫున వాదిస్తున్న సిద్ధార్థ్‌ లూద్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు సంగతి అలా ఉంచితే ఈ కేసుకు దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాది సిద్ధార్థ్‌ లూద్రాను పోలీసులు నియమించుకోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.



Eha Tv

Eha Tv

Next Story