జమ్మూ కశ్మీర్‌(Jammu kashmir), హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana electon) ఫలితాలు ఎన్టీయేకు ఆనందాన్ని ఇచ్చాయి.

జమ్మూ కశ్మీర్‌(Jammu kashmir), హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana electon) ఫలితాలు ఎన్టీయేకు ఆనందాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా హర్యానాలో విజయం సాధించడం ప్రధాని నరేంద్రమోదీకి(Narendra Modi), భారతీయ జనతాపార్టీకి అమితమైన ఆనందాన్ని కలిగించింది. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కీలకమైన ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి బూస్టునిచ్చాయి. జమ్మూకాశ్మీర్‌పై బీజేపీ(BJP) పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయినప్పటికీ బీజేపీ అనుకున్నదాని కంటే ఒకట్రెండ్ సీట్లు ఎక్కువగానే గెల్చుకుంది. హర్యానా ఫలితమే బీజేపీకి కొండంత బలాన్ని ఇచ్చింది. రెండు దఫాలుగా అక్కడ అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. హర్యానాలో గెలవడం అంత సులువు కాదని బీజేపీకి కూడా తెలుసు. కాకపోతే ఈ రెండు రాష్ట్రాలలో ఓడిపోతే, ఈ ప్రభావం రాబోయే ఎన్నికలపై పడుతుందని బీజేపీ ఆందోళన చెందుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే హర్యానాపై స్పెషల్ ఫోకస్‌ పెడుతూ వచ్చింది. ఆ ఫోకస్‌ బీజేపీకి బెటర్‌ రిజల్ట్స్‌ను ఇచ్చింది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేయడంతో మోదీ సంతోషంగా ఉన్నారు. బీజేపీ కూడా హ్యాపీగా ఉంది. కానీ బీజేపీ మిత్రులు మాత్రం సంతోషంగా లేదు. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే బీజేపీ మిత్రులు ఎందుకు సంతోషంగా ఉండరన్న డౌట్ రావచ్చు. అయితే రాజకీయ సమీకరణలు చూసిన వారికి మాత్రం ఇట్టే అర్థమవుతుంది. కేంద్రంలో ఎన్డీయే సర్కారు నితీష్‌ కుమార్‌, చంద్రబాబునాయుడు మద్దతులో నడుస్తున్నది. వీరిద్దరి మద్దతు లేకపోతే కేంద్రంలో నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యేవారు కాదు. జమ్మూ కశ్మీర్‌, హర్యానాలలో బీజేపీ ఓడిపోయి ఉంటే కనుక ఎన్డీయేలో చంద్రబాబు, నితీష్‌ల పట్టు పెరిగేది. ఎన్డీయేలో వీరి ప్రాధాన్యత మరింత పెరిగేది. బీజేపీ కూడా కొంత జాగ్రత్తగా ఉండేది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో జోష్‌ కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీని వదిలిపెట్టి ఎవరూ బయటకు పోలేరు. మరోవైపు కాంగ్రెస్‌ ఓడిపోవడం పట్ల ఆ పార్టీ మిత్రులు కూడా హ్యాపీగా ఉన్నారు. గెలిచి ఉంటే మాత్రం తమపై పెత్తనం చేసేది అని ఆ పార్టీలు భావిస్తున్నాయి.



Updated On 9 Oct 2024 6:05 AM GMT
Eha Tv

Eha Tv

Next Story