Journalist Revathi Arrest : రేవతి అరెస్ట్ ఏం చెప్తోంది..!
తెలంగాణలో ఈరోజు రెండు సంఘటనలు జరిగాయి. ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగించారు. తన ప్రభుత్వం ఏడాది కాలంలో ఇన్ని ఘనతలు సాధించిందని చెప్పారు.

తెలంగాణలో ఈరోజు రెండు సంఘటనలు జరిగాయి. ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగించారు. తన ప్రభుత్వం ఏడాది కాలంలో ఇన్ని ఘనతలు సాధించిందని చెప్పారు. అదే సమయంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై సాయంత్రానికి పోలీసులు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఆ ఇద్దరు జర్నలిస్టులను ఫొటోలను విడుదల చేశారు పోలీసులు. వారి కళ్లపై ముసుగు వేసి దొంగల తరహాలో మహిళా జర్నలిస్టులు విడుదల చేశారు. ఈరోజు అన్ని పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, పౌరులకు సంబంధించిన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. వాళ్లకు వర్తించే 41ఏ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారేమో అన్నట్లు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన విజయాలు చాలా గొప్పగా చేప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్రసంగాన్ని యథాతథంగా గవర్నర్ చదువుతారనేది సత్యం కానీ ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్టులు మాత్రం ప్రభుత్వానికి ఓ మచ్చ అనే చెప్పొచ్చు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ
