Lotus Pond Gate Demolish : జగన్ ఇంటిపైకి జేసీబీని పంపిందెవరు?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) సంబంధించిన హైదరాబాద్ నివాసం లోటస్‌పాండ్(Lotus Pond) దగ్గర ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) సంబంధించిన హైదరాబాద్ నివాసం లోటస్‌పాండ్(Lotus Pond) దగ్గర ఉంటుంది. ఈ ఇంటి బయట సెక్యూరిటీ నిమిత్తం కొన్ని షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ షెడ్లు స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. చుట్టుపక్కలవాళ్లు జీహెచ్‌ఎంసీకి కంప్లయింట్ కూడా చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్థానిక జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు వాటిని కూల్చివేశారు. రెండు రోజులుగా మనం వింటున్న వార్త ఇది! అయితే ఈ షెడ్లను కూల్చివేయడానికి సంబంధించి ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలకమైన మంత్రి ఇచ్చారు. ఆ మంత్రి ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు షెడ్లను కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారిని వెంటనే జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే బదిలీ చేసిందన్నమాట! ముఖ్యమంత్రికి తెలియకుండా, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రివైపు నుంచి ఆదేశాలు లేకుండా ఆ అధికారి కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారనేది ఇన్‌సైడ్ టాక్. అయితే ఈ అధికారికి ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎవరు? ఆగమేఘాల మీద అధికారులు కార్యరంగంలోకి ఎందుకు దూకాల్సి వచ్చింది? అసలు అక్కడ షెడ్ల వల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయంటూ ఫిర్యాదు చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిర్యాదు చేశారా? లేక ముందే కంప్లయింట్ ఇచ్చారా? లోటస్‌పాండ్‌లో దాదాపు పదేళ్లకు పైగా ఆ షెడ్లు ఉన్నాయి. పదేళ్లుగా ఎవరికీ రాని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు? ఈ సంఘటనపై ఓ సీనియర్ అధికారిని బలిపశువును చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మంత్రి చెప్పారు కాబట్టే ఆ అధికారి ఆ పని చేశారు. అక్కడ ఉన్న నిర్మాణాలు కచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే!అధికారి తన డ్యూటీ తాను చేశాడు. ఆ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది అంటే అక్కడ ఉన్న నిర్మాణాలు సక్రమమైనవేనని ప్రభుత్వం ఒప్పుకుంటున్నాట్టే కద!