Political Parties PR Stunts : పరువు తీస్తున్న పీఆర్ స్టంట్లు.
రాజకీయపార్టీలకు(Political Parties) ఇప్పుడు వ్యూహకర్తల అవసరం పడింది.
రాజకీయపార్టీలకు(Political Parties) ఇప్పుడు వ్యూహకర్తల అవసరం పడింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిలో, తమకు అందుబాటులో ఉన్న వ్యక్తులను వ్యూహకర్తలుగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో స్ట్రాటజిస్టుల అవసరం పార్టీలకు ఎంతగానో ఉంటున్నది. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు ఓ వ్యూహకర్తను నియమించుకోవడం కూడా జరుగుతోంది. అలాగే విపక్ష పార్టీలకు కూడా వ్యూహకర్తలు అవసరమే! ఏ రకంగా పోరాటం చేయాలి? ఏ అంశాలను ఎత్తుకోవాలి? ఎప్పుడు నిరసనలు తెలపాలి? అన్నది చాలా అవసరం. ఇంతకు ముందు ఇలాంటిది లేదు. పార్టీలు ఇలా వ్యూహకర్తల మీద ఆధారపడింది లేదు. సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయిన కారణంగా కేవలం పేపర్‌లో చదివో, సాయంత్రాలు టీవీలలో వార్తలు చూసో ప్రజలు రాజకీయాలను అర్థం చేసుకునే పరిస్థితి కాకుండా ప్రతి క్షణం మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాజంలో ఏం జరిగిందన్నది తెలుసుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అందుకే రాజకీయపార్టీలు జాగ్రత్తగా ఉండాలి. పీఆర్ స్టంట్ల జోలికి వెళ్లకూడదు. ఎందుకు వెళ్లకూడదో ఈ కింది వీడియోలో తెలుసుకుందాం!