YNR Analysis: రేసు కేసు కాంగ్రెస్‌కు చుట్టుకుంటుందా..
రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.
రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఏసీబీ విచారణకు హాజరైన సందర్భంగా కేటీఆర్ తన లాయర్‌ను తీసుకొని వెళ్లారు. లాయర్‌తో పాటు విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్.. లాయర్‌ను ఎందుకు తీసుకెళ్లారని కాంగ్రెస్ ప్రశ్నించింది. లాయర్‌ను తీసుకెళ్తే మీకు భయం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. కేసుకు సంబంధించి గతంలో పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. అవినీతికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏడు ఏళ్ల జైలు పడే కేసులను పెట్టారు. ఈ కేసులో ఏసీబీ అవినీతిని నిరూపించాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే కోర్టులు చీవాట్లు పెట్టే అవకాశం లేదు. అయితే ఈ కేసులో ప్రొసీజర్స్ పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసుపై 'జర్నలిస్టు YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!