జమలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
జమలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలెక్షన్(One Nation-One Election) బీజేపీ నినాదం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గానే ముందుకు వెళుతున్నది. తమ ప్రభుత్వ హయంలోనే జమిలి ఎన్నికలు(Jamili Election) జరుగుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah)కూడా చెప్పేశారు. అయితే జమిలి ఎన్నికలను కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ (Congress)అయితే జమిలి ఎన్నికలు అసాధ్యమని అంటోంది. కేవలం ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi),హోంమంత్రి అమిత్ షా మాత్రమే జమిలి ఎన్నికలను కోరుకుంటున్నారని కాంగ్రెస్ చెబుతున్నది. భారతదేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యమని స్పష్టం చేసింది. ఇండియా కూటమిలో ఉన్న మెజారిటీ రాజకీయ పక్షాలు కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్‌గా ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) ఇచ్చిన నివేదికకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు కూడా! ఇప్పుడు రాజ్యసభలో కూడా ఎన్టీయే మెజారిటీ వచ్చింది. గతంలో కీలక బిల్లులను పాస్ చేయించుకోవడానికి వైసీపీ(YCP)పైనో, జేడీయూ(JDU)పైనో, బీఆర్‌ఎస్(BRS)పైనో ఆధారపడాల్సి వచ్చేది. బీజేపీ(BJP)కి ఇప్పుడా సమస్య లేదు. అయితే జమిలి ఎన్నికలు సాధ్యామేనా అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. దేశమంతటా ఒకే సారి ఎన్నికలు జరిపించడానికి తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. అటు లోక్‌సభకు, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపడం సాధ్యమయ్యే పనేనా? అంత సిబ్బంది మనకుందా? బలగాలు సరిపోతాయా? ఓ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర బలగాలు ఓ నెలరోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తున్నది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తున్నది. అయితే దశలవారీగా ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి ఇది పెద్ద సమస్య కాబోదని బీజేపీ అంటోంది. జమిలి ఎన్నికలకు ఇంకేం ప్రతిబంధకాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం.