కూటమి సర్కార్‌లో ఏం జరుగుతోంది. అధికారంలోకి కూటమి సర్కార్‌ వచ్చి ఏడు నెలలవుతోంది.

కూటమి సర్కార్‌లో ఏం జరుగుతోంది. అధికారంలోకి కూటమి సర్కార్‌ వచ్చి ఏడు నెలలవుతోంది. ఏడు నెలల కాలంలోనే కూటమి సర్కార్‌లో ఈ స్థాయి లుకలుకలు ఎందుకు ఉన్నాయి. ఈ స్థాయిలో గందరగోళం ఎందుకు ఉంటుందో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది. కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీలుగా మూడు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు ఉన్నాయి. బీజేపీ అంటే టీడీపీ ఏం చెప్తే అది చేస్తం అనే స్థాయిలోకి వెళ్లి పోయింది. కూటమికి కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతాపార్టీని జాతీయ భారత జనతాపార్టీగా బీజేపీ నాయకులు కూడా చూడడం లేదు. కొంత మందికి కోపం వచ్చినా ఇది నిజం, ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకుంటేనే భవిష్యత్‌ ఉంటుంది. కానీ కూటమిలో కీలకంగా ఉన్న పార్టీ జనసేన. జనసేన అవసరం లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగే స్థితిలో టీడీపీ ఉంది. కానీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు.. 10 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతున్నారు. కానీ కూటమిలో ఎక్కడో లుకలుకలున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!



Updated On 12 Jan 2025 2:30 AM GMT
ehatv

ehatv

Next Story