హెచ్‌సీయూ భూముల వివాదంపై తెలంగాణ(Telangana)లో జరుగుతున్న రచ్చ చూస్తున్నాం. ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోడాని ప్రయత్నిస్తోంది.

హెచ్‌సీయూ భూముల వివాదంపై తెలంగాణ(Telangana)లో జరుగుతున్న రచ్చ చూస్తున్నాం. ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోడాని ప్రయత్నిస్తోంది. ఈ భూములకు హెచ్‌సీయూ(HCU)కే ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీసస్ పెట్టడానికి వీల్లేదు. ఈ భూములు ఇలాగే ఉంచాలని అక్కడి విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. హెచ్‌సీయూ యాజమాన్యం కూడా ఈ భూములు మా యూనివర్సిటీకే చెందాలని వాదిస్తున్నారు. ఈ భూములు తీసుకోవడానికి వీల్లేదని వాళ్లు చెప్తున్నారు. 2004లోనే ఈ భూములను హెచ్‌సీయూ ప్రభుత్వానికి అప్పచెప్పిందనేది ప్రభుత్వం వాదన.

2004లోనే 25 సర్వేలోని 500 ఎకరాలకుపైగా భూమిని హెచ్‌సీయూ ప్రభుత్వానికి అప్పజెప్పిందని.. దీనికి కాంపన్షేషన్‌గా గోపన్‌పల్లి 36, 37 సర్వే నెంబర్లలో ఉన్న 300 ఎకరాలు HCUకు ఇచ్చింది ప్రభుత్వం. ఈ భూముల వివాదంపై టీజీఐఐసీ విడుదల చేసిన పత్రాల్లో ఇది కనపడుతోంది. హెచ్‌సీయూ నుంచి తీసుకున్న భూమిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ(IMG)కి కేటాయించింది.అయితే ఆ భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని కారణంగా 2006లో ఆ కేటాయింపులను రద్దు చేస్తున్నామని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐఎంజీ కోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ భూములపై కేసు నడుస్తోనే ఉంది. ఈ మధ్యనే ఈభూములు ప్రభుత్వానికే చెందాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకొని ఉద్ధండులను లాయర్లుగా పెట్టి కేసును గెలిచాం, ఈ భూముల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌ ప్రకటించారు. అయితే గోపనల్‌పల్లిలో కేటాయించిన భూమిని హెచ్‌సీయూ తీసుకుందా..? తీసుకుంటే ఆ భూమి ఎక్కడ ఉంది.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



Updated On 2 April 2025 6:40 AM GMT
ehatv

ehatv

Next Story