ఏపీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు సంబంధించిన చర్చ ఆంధ్రప్రదేశ్‌లో చాలా జరిగింది.

ఏపీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు సంబంధించిన చర్చ ఆంధ్రప్రదేశ్‌లో చాలా జరిగింది. జీవీరెడ్డి చాలా కొద్ది కొద్ది సమయమే టీడీపీలో పనిచేశారు. ఎన్నికల ముందు ఆ పార్టీ వాయిస్‌ను జీవీరెడ్డి చాలా బలంగా వినిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్‌ చొరవతో ఫైబర్‌ నెట్ చైర్మన్‌గా జీవీరెడ్డిని నియమించారు. అటువంటి జీవీరెడ్డి పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చింది. పదవికి మాత్రమే కాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సభ్యత్వాన్ని వదిలి వెళ్లడానికి కారణం ఎవరు అనేది తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది. ఆయన పార్టీని వదిలివెళ్లిపోవడమనేది టీడీపీ చూసుకోవాల్సిన వ్యవహారం. కానీ ఫైబర్‌నెట్ చైర్మన్‌ పదవిలో ఉండగా ఆయన కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. ఫైబర్‌నెట్‌ ఎండీ వైఖరిని తప్పు పట్టారు. ఐఏఎస్‌ అధికారి నిర్లక్ష్యం కారణంగా రూ.377 కోట్ల జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఐఏస్‌ అధికారి నిర్లక్ష్యం వల్లే రూ.130-140 కోట్లు ఉన్న జీఎస్టీ రూ.377 కోట్లకు ఎగబాకిందన్నారు. ఐఏఎస్‌ అధికారిగా ఉన్నందున రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదని బహిరంగంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఎందుకు ఆదేశించడం లేదు.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story