ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశంపార్టీకి బలమైన జిల్లాలలో ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ గుంటూరులో టీడీపీ బాగా పర్ఫామ్‌ చేస్తూ వస్తున్నది.

ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశంపార్టీకి బలమైన జిల్లాలలో ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ గుంటూరులో టీడీపీ బాగా పర్ఫామ్‌ చేస్తూ వస్తున్నది. 2014లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 151 స్థానాలు గెల్చుకున్న సమయంలో కూడా గుంటూరు జిల్లాలో తెలుగుదేశంపార్టీ తన పట్టును నిలుపుకోగలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశంపార్టీ గెల్చుకుంది. గుంటూరు జిల్లాను క్వీన్‌ స్వీప్‌ చేసిందా పార్టీ. గుంటూరు జిల్లాలో తెలుగుదేశంపార్టీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయడానికి అక్కడ తెలుగుదేశంపార్టీకి సంబంధించిన సామాజిక బలంతో పాటు బలమైన నాయకత్వం కూడా ఓ కారణం. గుంటూరు జిల్లాలో తెలుగుదేశంపార్టీకి బలమైన నాయకత్వం ఉంది. పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాస్‌, జీ.వీ. ఆంజనేయులు, ఆలపాటి రాజా. ఇలా చాలా సీనియర్‌ నాయకులు టీడీపీలో ఉన్నారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా తెలుగుదేశంపార్టీలో చేరారు. అంతేకాదు, మంత్రి నారా లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా గుంటూరు జిల్లా నుంచే! ఇలా గుంటూరులో జిల్లా తెలుగుదేశంపార్టీకి ఓ కంచుకోటలా తయారయ్యింది. ఆ స్థాయిలోనే అక్కడ ఎన్నికల ఫలితాలు కనిపించాయి. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి కీలకమైన కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా పోయిందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. కొంతమంది ముఖ్య నాయకుల మాటలను బట్టి చూస్తే వంద రోజుల్లోనే వీరిలో అంత నిర్వేదం ఎందుకు అని అనిపిస్తోంది. వీరి ఎలా అసంతృప్తితో ఉండటానికి కారణం పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలే!

Updated On 30 Sep 2024 2:00 PM GMT
ehatv

ehatv

Next Story