Floor Space Index : రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు..!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడనుంది. ఎంటా పిడుగు అనుకుంటున్నారా.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడనుంది. ఎంటా పిడుగు అనుకుంటున్నారా. ఇక్కడ ఫ్లాట్‌లు కొనాలనుకుంటే పిడుగపడనుందా లేదా భూములు కొనాలునుకుంటే పిడుగపడనుందా. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొస్తుంది. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఐ తీసుకురావాలని చూస్తోంది. ఎఫ్‌ఎస్‌ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(floor space index)ను అమలు చేయాలని చూస్తోంది. దీంతో ఒక ఎకరాలో ఎంత ఎస్‌ఎఫ్‌టీ(SFT) నిర్మించాలనేది నిబంధనలు తీసుకురానుంది. ఇప్పుడు ప్రతి ఎకరాకు 4 లక్షల నుంచి 6 లక్షల ఎస్‌ఎఫ్‌ఎటీలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్‌జోన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాల్లో నాలుగు నుంచి ఆరు లక్షల ఎస్‌ఎఫ్‌టీలో ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కోటి, కోటిన్నరలో ఫ్లాట్ దొరుకుతుంది. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో 60 నుంచి 70 లక్షల వరకు ఫ్లాట్లు దొరుకుతున్నాయి. అయితే ఈ FSI అమలులోకి వస్తే ఫ్లాట్‌ల ధరలు మాత్రం అమాంతం పెరగనున్నాయి. FSI కొత్త నిబంధనల ప్రకారం ఎకరానికి రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికే అనుమతి ఇస్తారు. దీంతో ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే మాత్రం ఫ్లాట్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. అపార్ట్‌మెంట్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి. ఇదే సమయంలో భూముల ధరలు తగ్గబోతున్నాయి. గతంలో ప్రభుత్వం వేలం పాట వేస్తే ఎకరం దాదాపు 100 కోట్ల వరకు పలికింది. వంద కోట్లు ఎందుకు పలికిందంటే 60-70 అంతస్తుల్లో నిర్మాణాలు చేసుకొని ఎకరానికి 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేస్తే ఆ భూమి కొన్నవారికి కొంత వయబులిటీ వస్తుంది. కానీ ఇంత ధరలు పెట్టి కొన్న ఈ భూముల్లో నిర్మాణాలపై ఆంక్షలు పెడితే మాత్రం భూమల ధరలు పడిపోనున్నాయి. ఇక ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
