ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణానికి సంబధించి గత ఎన్నికలకు ముందు టీడీపీ వివపరీతమైన ఆరోపణలు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణానికి సంబధించి గత ఎన్నికలకు ముందు టీడీపీ వివపరీతమైన ఆరోపణలు చేసింది. మద్యం విధానంలో గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన కుంబకోణాలకు పాల్పడిందని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసింది. గతంలో ప్రభుత్వం ఆధీనంలో మద్యం దుకాణాలు నడిచేవి. ఆ దుకాణాల్లో కూడా ప్రజలకు నచ్చే బ్రాండ్లు ఉండేవి కావు. కొన్ని మద్యం బ్రాండ్లనే తీసుకొచ్చారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలసీని రద్దు చేసి మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను టెండర్ల ద్వారా అప్పగించింది. ప్రజలకు అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని సీఐడీ విచారణకు ఆదేశించారు. మూడు, నాలుగు నెలలపాటు సీఐడీ విచారణ కొనసాగింది. అయితే రెండు రోజుల క్రితం ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. దీంతో సిట్‌కు భయపడి జగన్‌ తన నివాసంలోని ట్రంకు పెట్టెల్లో ఉన్న మద్యం ఫైల్స్‌ను తగలబెట్టారు అని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. సిట్ వేసిన వెంటనే జగన్‌ భయపడి తన ఇంటి ముందున్న ఫుట్‌ పాత్‌పై మద్యం పేపర్లన్నీ కాల్చేశాడని టీడీపీ మీడియా వార్తలు రాసుకొచ్చింది. అసలు ఈ ఫైల్స్ కాల్చడం వాస్తవమా.. సాధ్యమేనా..సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ


ehatv

ehatv

Next Story