ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ లతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ లతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలల కాలంలో మొదటి ఎన్నికగా సాగు నీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలను పేర్కొనవచ్చు. సాగు నీటి సంఘాలకు చెందిన ఎన్నికల్లో అందరూ పాల్గొనరు. సాగు నీటి సంఘం పరిధిలో భూమి ఉండి, సోసైటీ లో సభ్యుడు గా ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికలు కూడా రాజకీయ పార్టీలకు ముఖ్యమైనవే. ఇందులో పోటీ చేయాలంటే సొసైటీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత అధికారులది. అయితే పోటీ చేద్దామని అనుకుంటున్న వారిలో 95 శాతం మందికి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారంటే కూటమి అభ్యర్థులకు మాత్రమే ఇచ్చారు. కూటమికి వ్యతిరేకంగా పోటీ చేద్దామనుకుంటున్న ఏ ఒక్కరికీ నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వలేదు అధికారులు. ఒకటి రెండు చోట్ల సర్టిఫికెట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ(TDP) కార్యకర్తలు వాటిని చించేసారు.

ehatv

ehatv

Next Story