చంద్రబాబునాయుడు.. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌లో కీలకంగా వ్యవహరించారు. వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు.

చంద్రబాబునాయుడు.. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌లో కీలకంగా వ్యవహరించారు. వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. గోద్రా అల్లర్లకు వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్‌ ఇచ్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఢిల్లీలో మోడీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని టీడీపీ చెప్పుకొచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు మోడీని అంటరానివాడిగా ట్రీట్ చేసింది. కానీ 2014లో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చి ప్రధాని మోడీ మోడీ టార్గెట్‌గా సీరియస్ విమర్శలు చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో చేసిన విమర్శలకంటే 2018లో ఇంకా ఎక్కువ విమర్శలు చేశారు. మోడీ కుటుంబ సభ్యులను కూడా ప్రస్తావిస్తూ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. అమరావతికి మట్టి, నీళ్లు ఇచ్చారని అభివృద్ధిని విస్మరించారని, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు. మోడీ, అమిత్ షా పర్యటనను తీవ్రంగా అడ్డగించాయి టీడీపీ శ్రేణులు. ఆ స్థాయిలో విమర్శించినా 2024లో మళ్లీ మోడీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ ద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో ఎన్ని విమర్శలు వచ్చినా పవన్‌ ఒత్తిడి వల్ల బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలిసి పనిచేస్తున్నా చంద్రబాబుపై బీజేపీకి నమ్మకం లేదా.. చంద్రబాబును ఒక క్రెడిబుల్ పార్ట్‌నర్‌గా భారతీయ జనతాపార్టీ చూడడం లేదా..ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ


ehatv

ehatv

Next Story