ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి విడుదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మధ్య గడిచిన కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి విడుదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మధ్య గడిచిన కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. తనపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించడంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని ఆమె చెప్తున్నారు. తనపై నమోదైన ఏసీబీ కేసు వెనుక లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని ఆమె ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కొంత మంది పోలీసు అధికారులతో తన కాల్‌ డేటాను సేకరించారని, తాను ఎవరితో ఏమేం మాట్లాడుతున్నానో సమాచారాన్ని రాబట్టారని ఆమె చెప్తున్నారు. ఆయన తన వ్యక్తిగత జీవితంలోకి రావాలనుకున్నాడని విడుదల రజనీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని అప్పటి వైసీపీ అధిష్టానం వద్దకు తాను తీసుకెళ్లానని ఆమె అన్నారు. పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో అప్పటి నుంచి తనపై కక్ష కట్టారని ఆమె వాదిస్తున్నారు. ఇప్పుడు కక్ష పూరితంగా తనపై కేసులు నమోదు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆమో ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. తన ఇంట్లో మహిళలను తాను ఎలా చూస్తానో బయట మహిళలను కూడా అంతేలా గౌరవిస్తానని ఆయన అన్నారు. విడుదల రజనీ ఓ క్రషర్‌ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిందన్నారు. ఓ మధ్యవర్తి ద్వారా క్రషర్‌ యజమాని నుంచి డబ్బులు తీసుకున్నారని, ఇదే విషయంలో కేసు నమోదైందన్నారు. కేసు నమోదు కావడంతో ఓ మధ్యవర్తితో ఆ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు విడుదల రజనీ సిద్ధమైందని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకుందో తనకు తెలుసని, ఎవరి నుంచి ఎంతెంత వసూలు చేశారో చిట్టా విప్పుతానన్నారు. అయితే ఇది వ్యక్తిగత వ్వవహారమా లేదా క్రషర్‌కు సంబంధించిందేనా.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story