లడ్డూ వివాదంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపించామని ఎక్కడా లేదని..

లడ్డూ వివాదంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపించామని ఎక్కడా లేదని.. దర్యాప్తు సంఘం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యిపై విచారణ జరపాలని ఆయన కోరారు. టెండర్‌ డ్యాకుమెంట్‌లు ఎలా రిలీజ్‌ చేశారన్నది కూడా చూడాల్సి ఉందని, ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు మొదలవుతుందన్నారు. ఇన్విస్టిగేషన్‌లో అనేక విషయాలు తెలుస్తాయి

ఎఆర్‌ ఫుడ్స్‌కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? క్విడ్‌ ప్రోకో ఏమైనా జరిగిందా అన్నది దర్యాప్తు చేయాలని లక్ష్మీనారాయణ అన్నారు.

గ్యాస్‌ క్రోమోటోగ్రఫీతో నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో చెప్పొచ్చని.. ఎస్‌ వ్యాల్యూతో కూడా నెయ్యిలో ఏం కలిసిందో చెప్పొచ్చని ఆయన ఆభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు స్టేట్‌మెంట్‌ను కూడా సిట్‌ రికార్డు చేస్తుందని లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్ స్టేట్‌మెంట్‌తో పాటు టీటీడీ ఈవో స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డ్‌ చేస్తుందని చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ. పవన్‌ కల్యాణ్‌ అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో జంతుకొవ్వు కలిపారా లేదా అన్న సంగతి కూడా తేలుతుందన్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇదని..

లడ్డూ నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు, ల్యాబ్‌ టెక్నిషియన్ల స్టేట్‌మెంట్లు కూడా తీసుకుంటారు. తక్కువ ధరకు నెయ్యి ఇస్తున్నారంటే చాలా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. తల్చుకుంటే విచారణను నెలరోజుల్లో పూర్తి చేయవచ్చని.. ఆలస్యం అవుతున్న కొద్దీ అనుమానాలు వస్తాయి

సత్యాసత్యాలు బయటకు రావాలని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

Updated On 5 Oct 2024 1:00 PM GMT
ehatv

ehatv

Next Story