ఆంధ్రప్రదేశ్‌లో రీసెంట్‌గా జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మందికి చాలా చాలా అనుమానాలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రీసెంట్‌గా జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మందికి చాలా చాలా అనుమానాలు వచ్చాయి. ఫలితాలలో ఏదో జరిగి ఉంటుందనే అభిప్రాయాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో లెక్కలు ఈ అనుమానాలు బలపడేలా చేశాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు, మీడియా ఏజెన్సీలు ఎన్నికల సంఘం ప్రాపర్‌గా ఎన్నికలను నిర్వహించలేదని చెబుతూ వచ్చాయి. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు చాలా తేడా ఉంది. చాలా నియోజకవర్గాలలో ఇలాంటి వ్యత్యాసం ఉంది. ఈ కారణంగానే ఫలితాలు తారుమారు అయ్యాయి. అయితే ఎన్నికల కమిషన్‌ మాత్రం ఈ విషయంపై నోరు మెదపలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎక్కడా క్లారిఫై ఇచ్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్న సందర్భంలో ఈవీఎంలు బాగా పని చేస్తున్నాయంటూ ఎన్నికల సంఘం అధికారులు చెప్పేసి వెళ్లిపోయారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది.

Updated On 29 Oct 2024 10:46 AM GMT
ehatv

ehatv

Next Story