EVM Tampering:బలపడుతున్న EVM ట్యాపరింగ్ అనుమానం!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల గోల్‌మాల్ జరిగిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP)పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల గోల్‌మాల్ జరిగిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP)పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల(EVM)పైన నిందలు వేయడం ఇదేం మొదటిసారి కాదు. అందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్(Election Commission)చెప్పిన దాని ప్రకారం ఆ లెక్కలలో చాలా తేడాలున్నాయంటూ దేశవ్యాప్తంగా అనేక ఏజెన్సీలు చెబుతూ వున్నాయి. అవేమీ కట్టుకథలు చెప్పడం లేదు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న విషయాన్నే చెబుతూ ఉన్నాయి. ఏమిటా విషయం? ఎలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో పోలైన ఓట్లకు, ఆ తర్వాత లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలైన ఓట్లకు, కౌంటైన ఓట్లకు తేడా 45 లక్షలకు పైగా ఉందనే విషయం తాజాగా బయటపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొంతమంది ఈవీఎం ప్యాడ్లు(EVM pads), ఈవీఎం మిషన్ల(Evm mission)పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రీ కౌంటింగ్ చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. ఎన్నికల సంఘాన్ని ఇలా అభ్యర్థించుకునే అవకాశం ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసి మొదటి రెండు మూడవ స్థానాలలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా వారం రోజుల లోపు ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. రీ కౌంటింగ్(Recounting) కోసం అభ్యర్థులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎన్నికల సంఘం డ్యూటీ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం!