ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మంగళవారం ఈనాడు దిన పత్రిక ఒక వార్తను ప్రచురించింది.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మంగళవారం ఈనాడు దిన పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఇంగితం లేదా అంటూ గౌతు శిరీష, కొలుసు పార్థ సారథి ఫోటోలు పెట్టి మరీ వార్త రాసింది. కృష్ణా జిల్లా కు చెందిన పార్థ సారథి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రి గా ఉన్నారు. శ్రీకాకుళం కు చెందిన శిరీష కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆమె పోరాడి ఎంఎల్ఏ(MLA) గా గెలిచారు. వీరిద్దరికీ ఇంగితం లేదు అని ఈనాడు చెప్పదలచుకున్నది. అది కూడా మొదటి పేజీ ద్వారా చెప్పాలనుకున్నది. ఇలాంటి హెడ్డింగ్ తో, ఇలాంటి కథనాన్ని, మొదటి పేజీలో ప్రచురించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంగితం ఆ నేతలకు లేదా లేక ఈనాడు(EENADU)కు లేదా అన్న అనుమానం కూడా కలిగించింది. ఇంతకీ వీరిద్దరూ చేసిన తప్పు ఏమిటయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడమే! గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అది. ఈనాడు పత్రిక చాలా తెలివిగా సోషల్ మీడియా లో ఇలా అనుకుంటున్నారు అంటూ రాసు కొచ్చింది. సోషల్ మీడియా లో వచ్చిన చెత్త అంతా పేపర్లో ప్రచురించాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. వాటిని వదిలేసి కేవలం వీరిద్దరి గురించే రాయడంలో వీరిపై ఈనాడుకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసిపోతున్నది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఇంగితం ఉండాల్సిన అవసరం ఏముంది? గౌతు లచ్చన్న అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో అరుదైన వ్యక్తి. విలువలకు కట్టుబడిన మనిషి. ఉన్నతమైన భావాలు ఉన్న నేత. బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ఆదర్శ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఆయన! అలాంటి మనిషిని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు. ఆ మహా నాయకుడి విగ్రహావిష్కరకు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు పాల్గొన్నారు. ఇందులో జోగి రమేష్(Jogi Ramesh) కూడా పాల్గొన్నారు. ఈయనతో కలిసి పార్థ సారథి(pardhasaradhi), శిరిషలు స్టేజ్ పంచుకోవడంలో తప్పు ఏముంది? ఎందుకు ఈనాడుకు తప్పుగా అనిపించింది? టీడీపీ(TDP) సోషల్ మీడియా కూడా ఇదేదో మహా అపరాధం అన్నట్టుగా రాతలు రాసింది. మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అయితే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలంటూ ఆ ఇద్దరు నేతలను ఆదేశించారు. ఎటు పోతున్నది రాష్ట్రం?

ehatv

ehatv

Next Story