ED vs Politicians : పొలిటికల్ దాడుల ఈడీ..!
దేశంలో మోడీ(Modi) సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోందని ఎన్డీఏ(NDA) ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.

దేశంలో మోడీ(Modi) సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోందని ఎన్డీఏ(NDA) ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. గతంలో యూపీఏ(UPA) హయాంలో కూడా ఈ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేశాయన్నారు. అయితే మోడీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈడీ, సీబీఐ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. తమ హయాంలో చాలా పారదర్శకంగా వ్యవహరించామని కాంగ్రెస్ చెప్తోంది. తమ హయాంలో రాజా, కనిమొళి వంటి వారిని జైళ్లకు పంపించామని కాంగ్రెస్(Congress) వాదిస్తోంది. యూపీఏ హయాంలో ఇటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ, మోడీ హయంలో ఇది మరింత పెరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఏజెన్సీలను వాడుకొని రాజకీయపరమైన అవసరాలను తీర్చుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈడీలు(ED), సీబీఐ(CBI)ని వాడి రాజకీయపార్టీలను తమ దారికి తెచ్చుకుంటోందని ఎన్డీఏపై ఆరోపణలు వచ్చాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈడీ నమోదు చేసిన కేసులు, నిరూపితమైన కేసులపై ఆర్థిక మంత్రి స్వయంగా వెల్లడించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎన్ని కేసులు నిరూపితమయ్యాయనేది ఒకసారి చూద్దాం. ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
