ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై ఈడీ ముందడుగు వేసింది. కొన్ని ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో ఇంతకు ముందు చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. కొనుగోళ్లు జరగకుండానే భారీగా అవినీతి చేశారంటూ సీఐడీ ఆరోపించింది. అప్పుడు దీనిపై విచారణ చేసిన సీఐడీ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఈ కేసుకు సంబంధించి రకరకాల రాజకీయపరమైన విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఈ కేసు తీవ్రమైన ప్రకంపనలు రేపింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ-జనసేన-బీజేపీ జట్టుగా కూటమి కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నాయకత్వం కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించింది. ఢిల్లీ బీజేపీ పెద్దలు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలోనే టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించిన ముహూర్తం కూడా ఖరారయ్యింది. చంద్రబాబు అరెస్ట్ అయిన రాజమండ్రి జైలు దగ్గరే పొత్తు ప్రకటన వచ్చింది. ఈ కేసుకు, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు, రాజకీయ పరిణామాలకు దగ్గర సంబంధం ఉంది. దీన్ని ఫాబ్రికేటెడ్‌ కేసుగా కూటమి నేతలు చెబుతూ వచ్చారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా పెట్టిన కేసుగా చెబుతూ వచ్చారు. ఈ కేసు నిలబడదని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తమ ప్రమేయం ఏమీ లేదని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అక్రమాలు జరిగాయంటూ కేంద్రప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో అప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. అప్పుడే ఈడీ విచారణ చేసింది. ఆ తర్వాత ఈ కేసును ఏపీ సీఐడీ టేకోవర్‌ చేసింది. ఇందులో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. ఆ తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేశామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం ఉందని తెలుసుకున్న తర్వాతే ఆయనను జైల్లో పెట్టామని సీఐడీ చెప్పింది. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా రాజకీయ పార్టీలు జగన్‌పై ఆడిపోసుకున్నాయి. ఇది రాజకీయ దురుద్దేశంతో జగన్‌ పెట్టిన కేసుగా చెప్పుకొచ్చాయి. జైలులోపల చంద్రబాబును రకరకాలుగా హింసించారంటూ టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇవన్నీ ఎన్నికల ఎజెండాగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు అరెస్ట్‌ కూడా ఓ కారణమని విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం కేంద్రంలోనూ, ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో , ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈడీ ఈ కేసుకు సంబంధించి సీమెన్స్‌ కంపెనీకి చెందిన 23 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్‌ చేయడమంటే, ఈ కేసు క్లోజ్‌ అయినట్టు కాదని రుజువవుతోంది. ఈ కేసులో అక్రమాలు జరిగాయని ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఓ దర్యాప్తు సంస్థ ఈడీ. కేంద్రప్రభుత్వంలో తెలుగుదేశంపార్టీ కూడా పార్టనర్‌గా ఉంది. ఏపీలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసే సర్కార్‌ను ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఈడీ దూకుడుగా వెళుతోంది. అంటే చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమం కాదని, జగన్‌ కక్ష పూరితంగా పెట్టిన కేసు కాదని దీన్ని బట్టి రుజువవుతోంది.


ehatv

ehatv

Next Story