ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవి అంశంపై గడిచిన వారం, పది రోజులుగా చూస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవి అంశంపై గడిచిన వారం, పది రోజులుగా చూస్తున్నాం. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే వార్తలు, చేయాలన్న డిమాండ్లు, అలా మాట్లాడొద్దని టీడీపీ అధిష్టానం నుంచి వార్తలు ఇవన్నీ చూస్తున్నాం. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ ముఖ్య నాయకులు, పొలిట్‌బ్యూరో మెంబర్లు కూడా మాట్లాడడం చాలా సందర్బాల్లో చూశాం. గతంలో నారా లోకేష్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ముందు కూడా ఇదే తరహా క్యాంపెయిన్‌ను టీడీపీ చూసింది. గతంలో చాలా సందర్భాల్లో టీడీపీ మోడ్‌ ఆఫ్ ఆపరేషన్‌ ఏ రకంగా ఉంటుందో అదే తరహా మోడ్‌ ఆఫ్ ఆపరేషన్‌ కూడా పదవీ అంశంలో జరుగుతోంది. నారా లోకేష్‌కు బాధ్యతలు ఇవ్వాలని, బాధ్యతలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల వరకు లీడర్‌గా ఎలా ఎదుగుతాడని టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి. గతంలో రాహుల్‌ విషయంలో సోనియాగాంధీ, కేటీఆర్‌ విషయంలో కేసీఆర్‌ చేసిన తప్పును చంద్రబాబు చేయకూడదని వాదిస్తున్నారు. నారా లోకేష్‌ డిప్యూటీ సీఎం చేయడంలో తప్పులేదు కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యి, లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పు లేదు అని జనసేన నేతలు అనడం వార్తల్లో చూశాం. అయితే నారా లోకేష్ త్వరలోనే ఏ పదవి చేపట్టబోతున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆయనకు దక్కే ముఖ్య పదవి ఏంటి.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!

Updated On 25 Jan 2025 12:48 PM GMT
ehatv

ehatv

Next Story