దేశంలో ఈవీఎంల అంశానికి సంబంధించి చాలా పెద్ద చర్చే జరుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంలపై అనుమానాలు ఎక్కువయ్యయి.

దేశంలో ఈవీఎంల అంశానికి సంబంధించి చాలా పెద్ద చర్చే జరుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంలపై అనుమానాలు ఎక్కువయ్యయి. చాలా మంది ఈవీఎంల ట్యాంపరింగ్‌పై మాట్లాడుకుంటున్నారు. దాదాపు 300లకు పైగా లోక్‌సభ నియోజకవర్గాలలో ప్రజలు వేసిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను లెక్కబెట్టారంటూ ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్లే చెబుతున్నాయి. దీనిపై ప్రశ్నిస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం నుంచి జవాబు రావడం లేదు. తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్‌పార్టీ ఘన విజయం సాధించబోతున్నదంటూ అన్ని సర్వేలు చెప్పాయి. ఎగ్జిట్‌పోల్స్‌ కూడా ఇదే చెప్పుకొచ్చాయి. బీజేపీ అనుకూల ఛానెళ్లు కూడా కాంగ్రెస్‌ పార్టీదే విజయమని అన్నాయి. అయితే అక్కడ బీజేపీ విజయం సాధించింది. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పింది జరగలేదు కాబట్టి ఈవీఎంలను అనుమానించాలా? అంటే కచ్చితంగా లేదు. కాకపోతే హర్యానాలో కాంగ్రెస్‌ ఓడిపోతుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. బీజేపీ స్వయంగా చేయించిన సర్వేలు కూడా కాంగ్రెస్‌ పక్షానే నిలిచాయి. అయితే అక్కడ బీజేపీ గెలిచింది. అందుకే ఈవీఎంలపై అనుమానాలు కలుగుతున్నాయి. వీటిని అనుమానాలుగానే చూడాలి. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతీసారి ఈవీఎంలపై అనుమానాలు వస్తుంటాయి. ఓడిపోయిన వారు వేస్తున్న నిందగానే వీటిని పరిగణించాలి. అయితే హర్యానా ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత జైరామ్‌ రమేశ్‌ తీవ్ర ఆరోపణ చేశారు. ఎన్నికల సంఘానికి ఓ లేఖ కూడా రాశాలరు. రెండు మూడు జిల్లాలలో ఈవీఎంలకు సంబంధించిన అంశంపై తమకు అనుమానాలున్నాయని జైరామ్‌రమేశ్‌ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. పోలింగ్ రోజు 50 శాతం ఛార్జింగ్‌ ఉన్న బ్యాటరీలు కౌంటింగ్‌ రోజు 90 శాతం చూపిస్తున్నాయి. ఇలా 90 శాతం ఛార్జింగ్‌ ఉన్న చోట్ల బీజేపీ విజయం సాధించింది. తక్కువ ఛార్జింగ్‌ ఉన్న చోట కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. అలా బ్యాటరీ ఛార్జింగ్‌ను పెంచింది ఎవరు? ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంటూ జైరామ్‌ రమేశ్‌ ఈసీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా ఇలాంటి సందేహాలే వచ్చాయి. విజయనగరం లోక్‌సభకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఇదే రకమైన డౌట్‌ను ఎక్స్‌ప్రెస్‌ చేశారు. పోలింగ్‌ రోజున 50, 60 శాతం వున్న బ్యాటరీ ఛార్జింగ్‌ కౌంటింగ్‌ రోజున 90 శాతం ఎలా వచ్చిందంటూ ఈసీని అడిగారు. ఈసీ దీనికి ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ముగ్గురునేతలు ఈసీతో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కాకపోతే అధినేత జగన్మోహన్‌రెడ్డి నిర్లిప్తత వహించారు. అప్పుడే జగన్‌ పోరాటానికి సిద్ధమయ్యి ఉంటే ఈవీఎంలపై ఉన్నఅనుమానాలు నివృత్తి అయ్యేవి. హర్యానా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ తప్పు చేయట్లేదు. వీవీ ప్యాట్లను లెక్కించాల్సిందేనని కాంగ్రెస్‌పట్టుబడుతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేసిన తప్పును హర్యానా కాంగ్రెస్‌ చేయడం లేదు.



ehatv

ehatv

Next Story