ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చిత్తూరు జిల్లాకు వెళ్లారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చిత్తూరు జిల్లాకు వెళ్లారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. చంద్రబాబునాయుడు ప్రతి నెలా ఒకటో తారీఖున ఏదో ఒక జిల్లాకు వెళ్లి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కొంత కలకలం రేగింది. వైసీపీకి చెందిన నాయకులకు ఎవరూ సాయం చేయొద్దు.. వైసీపీ నాయకులకు సాయం చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లు ఉంటుందన్నారు. వైసీపీకి చెందిన నాయకులు ఎవరూ ఏ పని అడిగినా కూడా చేయొద్దనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఈ వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యానికి లోనయ్యాయి. చంద్రబాబునాయుడు చంద్రబాబు పొలిటికల్ ప్రొఫైల్ చూసినవాళ్లకు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం కలగక మానదు. వైసీపీ నాయకులు గతంలో అక్రమాలు చేశారని అనేక ఆరోపణలు చేశారని వారికి ఎలాంటి సాయం చేయకూడదన్నారు. అసలు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల దగ్గరికి వస్తున్న వైసీపీ నాయకులు ఎవరు.. వాళ్లకు సాయం చేస్తున్నది ఎవరో చెప్పాలి. అసలు వైసీపీ నాయకులు ఏం పనులు చేయాలని కోరుతున్నారనేది ఇక్కడ తెలియాల్సిన విషయం. ఎవరికైనా పెన్షన్ రాకపోతే.. పెన్షన్ మంజూరు చేయాలని వస్తే చేయొద్దని చంద్రబాబు చెప్తున్నారా.. లేదా ఎవరికైనా ఏదైనా పథకం అందకపోతే పనిచేయాలని వైసీపీ నాయకులు వస్తే చేయొద్దని అంటున్నారా.. లేదా ఇసుక, మైనింగ్‌లో పనులు చేయాలని వైసీపీ నాయకులు వస్తే చేయొద్దని అంటున్నారా. మూడో పనికి వస్తే మాత్రం చేయొద్దనే అంటారు. కానీ చంద్రబాబునాయుడు చెప్తున్న వ్యాఖ్యలకు అర్థం ఏంటి.. వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఎవరు వచ్చినా చట్ట ప్రకారం చేయాలని అధికారులకు చెప్తే బాగుండేది. కానీ అలా కాకుండా వైసీపీ నాయకులు ఏ పని అడిగినా చేయొద్దని చెప్పడం ఎంత వరకు సబబు.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story