Journalist YNR : ఏబీ వెంకటేశ్వరరావుపై చంద్రబాబు అసంతృప్తి..!
ఏబీ వెంకటేశ్వరరావు 2029వరకు టీడీపీ అధికారంలో ఉన్నసమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు.

ఏబీ వెంకటేశ్వరరావు 2029వరకు టీడీపీ అధికారంలో ఉన్నసమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరారు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నట్లు వైసీపీ భావించింది.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు. ఆయన పోస్టును కూడా పీకేశారు. దీంతో ఆయన న్యాయపరంగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారం నుంచి దిగిపోవాలని కృషి చేశారు ఏబీ వెంకటశ్వేరరావు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో కూటమి సర్కార్‌కు చాలా ఎక్కువ ప్రయారిటీ దొరుకుతుందని అనుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇదే ఆశించారు. అయితే ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఈ పదవిపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవితో తన స్థాయిని తక్కువ చేశారా అన్న ఫీలింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు నెల గడుస్తున్నా ఆ పదవిని స్వీకరించలేదు. చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ శాసన సభ్యుల సమావేశంలో చంద్రబాబుకు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
