అల్లు అర్జున్ అరెస్టు కు సంబంధించి దేశ వ్యాప్తంగా మీడియా ప్రాధాన్యతను ఇచ్చింది. ఇది ఒక ప్రధాన వార్త గా మారింది.

అల్లు అర్జున్ అరెస్టు కు సంబంధించి దేశ వ్యాప్తంగా మీడియా ప్రాధాన్యతను ఇచ్చింది. ఇది ఒక ప్రధాన వార్త గా మారింది. ఛానెళ్లు అన్ని అల్లు అరెస్టు కు సంబంధించిన వార్తకు ప్రయారిటీ ఇచ్చాయి.దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు , రాజకీయ నాయకులు స్పందించారు. తెలంగాణకు చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ(BRS), ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించాయి. ఈ అరెస్టును ఖండించాయి. కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రముఖులు కూడా ఈ అరెస్టు సరైంది కాదన్నారు. బండి సంజయ్ కూడా ఇదే మాట అన్నారు. కక్ష సాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్టు ను ఖండించారు. ఈ అరెస్టు వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు. ఇలా అనేక మంది ప్రముఖులు, నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. అందరూ అల్లు అర్జున్ తప్పేమీ లేదని అభిప్రాయ పడ్డారు. హై కోర్టు కూడా దాదాపుగా ఇదే భావనను వ్యక్తం చేసింది. కానీ ఎందుకో ఏమో తెలుగు దేశం పార్టీ మాత్రం గమ్మున ఉంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరిపైనా ఎలాంటిది జరిగినా ముందుగా స్పందించే టీడీపీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఎందుకు మౌనం వహిస్తున్నదో అర్థం కావడం లేదు. మౌనం వెనుక కారణం ఏమిటో తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మాత్రం పుష్ప2 సినిమా రిలీజ్ ఎప్పుడు నెగెటివ్ ప్రచారం చేసిన మాట నిజం. జనసేన పార్టీ కి చెందిన నేతలు కూడా ఎక్కడా ఈ విషయంపై స్పందించలేదు. జనసేన నాయకుడు నాగబాబు మాత్రం అల్లు అర్జున్(Allu Arjun) ఇంటికి వెళ్ళారు. చిరంజీవి దంపతులు కూడా వెళ్ళారు. పార్టీ వైపు నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నాగబాబు బన్నీ ఇంటికి వెళ్ళారు కాబట్టి పార్టీ స్పందనే అనుకోవాలి. అయితే టీడీపీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షులారు పురంధేశ్వరి కూడా మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు ఒక్కరే ఈ అరెస్టు తప్పని చెప్పారు. ఒక వేళ ఏపీ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా అరెస్టు దగ్గరనుంచి గగ్గోలు పెట్టేది. నాన్ స్టాప్ కవరేజ్ ఇచ్చేది. హడావుడి మాములుగా ఉండేది కాదు. దేశం మీడియా మొత్తం స్పందిస్తే, ఎన్డీఏ ప్రముఖులంతా ఖండిస్తే టీడీపీ మాత్రం గమ్మున ఉంది. అల్లు అర్జున్ ను శత్రువుగా చూస్తోంది. పైగా అల్లు అర్జున్ కేసును వాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన వ్యక్తి కావడం కూడా టీడీపీ కి కోపం వచ్చినట్టుగా వుంది.

Updated On 14 Dec 2024 7:40 AM GMT
ehatv

ehatv

Next Story