ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే చర్చ ఇటీవలి కాలంలో చూశాం. 2024లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం మళ్లీ 2029లో ఎన్నికలు జరగాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే చర్చ ఇటీవలి కాలంలో చూశాం. 2024లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం మళ్లీ 2029లో ఎన్నికలు జరగాలి. కానీ ముందే ఎన్నికలు జరగవచ్చు అనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతూ వస్తోంది. ఆ మాటకొస్తే జగన్మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆరు నెలలలోనో, రెండేళ్లలోనో జగన్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళతారనే వార్తలు వినిపించాయి. ముందస్తు ఎన్నికలంటూ సర్వసాధారణంగా ప్రతిపక్షాలే అంటూ ఉంటాయి. ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నారంటూ చెబుతుంటాయి. అలా ఎందుకూ ? అంటే తమ క్యాడర్‌ను నిరుత్సాహంలోకి నెట్టకుండా ఉండేందుకు. ఎన్నికలు వస్తున్నాయని చెబితే యాక్టివ్‌గా ఉంటారన్నది ఉద్దేశం. ఇదిలా ఉంటే వన్‌ నేషన్‌, వన్‌ ఎలెక్షన్‌కు బీజేపీ వెళ్లబోతున్నదన్నది క్లియర్‌. అంటే 2029 కి ముందే దేశంలో ఎన్నికలు వస్తాయన్నది రూఢీ అయ్యింది. 2026, 2027లలో దేశమంతటా ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో దాదాపు 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అంటే సగం దేశం అన్నమాట! మిగతా రాష్ట్రాలను కూడా అక్కడికి తీసుకొచ్చి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. తమ హయాంలోనే, ఈసారే జమిలి ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు కూడా! అంటే అయిదేళ్లకంటే ముందే ఎన్డీయే సర్కార్‌ మళ్లీ ప్రజల తీర్పును కోరే అవకాశం ఉందన్నమాట! నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నోటి వెంట కూడా ఇలాంటి మాటే వచ్చింది. కేంద్ర బీజేపీని ప్రశంసించడానికే ఆయన ప్రత్యేకంగా ప్రెస్‌ మీట్‌ పెట్టారు. హర్యానాలో బీజేపీ గెలవడాన్ని చంద్రబాబు అభినందించారు. భారతీయ జనతాపార్టీ ఈ దేశంలో గణనీయమైన విజయాలను సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే ఆయన వన్‌ నేషన్‌, వన్‌ ఎలెక్షన్‌ దేశానికి అవసరమని నొక్కి వక్కాణించారు. ఒకేసారి అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరగాల్సిందేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ దేశానికి అది ఎంతో అవసరమన్నారు. పదే పదే ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలెక్షన్‌కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. దీనిపై కేంద్రం ముందుకు వెళ్లాల్సిందేనని అన్నారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలెక్షన్‌కు చంద్రబాబు కూడా మద్దతు పలికారు. ఆయన ఈ మాట అన్నారు అంటే ఏపీలో కూడా అసెంబ్లీకి ముందస్తుఎన్నికలు వస్తాయనే అనుకోవాలి.


ehatv

ehatv

Next Story