ఈ దేశంలో ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత నాయకులు పారిపోవడం కొత్తేమీ కాదు.
ఈ దేశంలో ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత నాయకులు పారిపోవడం కొత్తేమీ కాదు. కానీ కొంత మంది నాయకులకు అది అలవాటుగా మారిపోతుంది. చాలా మంది ప్రజలకు మోసపోవడం అలవాటుగా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు అనేక ఆకర్షణీయమైన హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చిన సందర్భంగా రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూలిపోయింది. శ్రీలంకలాగా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉందని పదే పదే చెప్పిన మాట. 14 లక్షల కోట్ల అప్పు ఉందని కేంద్రానికి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిన కూటమి నేతలు.. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే అంతకు మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పుకున్నారు. 14 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఎలా అని అడిగితే మాకు సంపద సృష్టించడం తెలుసు, సంపద సృష్టించి అమలు చేస్తామని వైసీపీ సంక్షేమ కార్యక్రమాలకంటే రెట్టింపు స్థాయిలో హామీలు కుమ్మరించింది. ఏది ఎవరు అడిగితే దానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే మెల్లగా పిల్లి మొగ్గలు వేయించడం ప్రారంభించింది. అసలు రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎన్ని ఉన్నాయి.. సంక్షేమ కార్యక్రమాల అమలుపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణలో..