ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో విద్యుత్‌ అంశానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CM Chandra Babu) మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)బాటలో వెళ్లబోతున్నారా అంటే ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో విద్యుత్‌ అంశానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CM Chandra Babu) మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)బాటలో వెళ్లబోతున్నారా అంటే ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు ఇస్తున్న పవర్‌కు సంబంధించి ఆ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలి. రైతులు ఎంత కరెంట్‌ను వాడుకుంటున్నారు? ఆ వాడిన కరెంట్‌కు బిల్లును కూడా రైతులకు అందించాల్సి ఉంటుందని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. భారతీయ జనతా పార్టీ (BJP)పాలిత రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడమేమిటి? మీటర్లు పెట్టాల్సిన అవసరం ఎందుకొస్తుంది? మీటర్లు పెట్డడం సరైంది కాదు అని బీజేపీకి చెందిన కొందరు ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్డానికి వారు ముందుకు రాలేదు. కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే మొట్టమొదటి సారిగా ముందుకొచ్చింది. ఇక్కడ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుటికీ మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్‌రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లాను ఓ పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని, శ్రీకాకుళం జిల్లాలో రైతుల మోటార్లకు మీటర్లు ఫిక్స్‌ చేశారు. మీటర్లు బిగించడమే కాదు, ఎంత పవర్‌ కాలిందో చెక్‌ చేసి వాటికి సంబంధించిన బిల్లులను రైతులకు అందచేస్తున్నారు. తర్వాత దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పని చేసింది. ఈ అంశాన్ని తెలుగుదేశంపార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రైతులను నట్టేట ముంచడమేనని ఆరోపించింది. రైతులకు కరెంట్ బిల్లులు వేయబోతున్నారని చెప్పింది.

Updated On 22 Aug 2024 2:00 PM GMT
ehatv

ehatv

Next Story