చేబ్రోలు కిరణ్‌ అరెస్ట్ జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై సభ్య సమాజం తలదించుకునేలా చేబోలు కిరణ్‌ వ్యాఖ్యానించారు.

చేబ్రోలు కిరణ్‌ అరెస్ట్ జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై సభ్య సమాజం తలదించుకునేలా చేబోలు కిరణ్‌ వ్యాఖ్యానించారు. సంస్కార హీనంగా మాట్లాడారు. దీనిని ఎవరూ అంగీకరించరు. కూటమి సర్కార్‌ చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేసి చాలా మంచి పనిచేసింది. మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం హర్షించదగ్గ విషయం. చేబ్రోలు కిరణ్ ఇలా మాట్లాడడం ఇప్పుడు కొత్త కాదు. గత మూడేళ్లుగా వైసీపీ(YCP) నేతలు, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నాడు. ఇక నిన్న వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం పరాకాష్టకు చేరాయి. పిచ్చి పీక్స్ అంటారు కదా అలా. చేబ్రోలు కిరణ్‌(Chebrolu Kiran Arrest) వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్సీపీకి చెందిన నేతలు తీవ్రంగా ఖండించారు. కిరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయక తప్పలేదు. గతంలో ముఖ్యమం్తరి చంద్రబాబు భార్యపై కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నేరుగా చేయకపోయినప్పటికీ అసెంబ్లీలో చేశారని అన్నారు. దానిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఆ సందర్భంగా వైసీపీ వ్యవహరించిన తీరు పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ అధిష్టానం ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించకూడదు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు భార్యపై చేసిన వ్యాఖ్యలను ఖండించి ఉంటే బాగుండేది అని చాలా మంది వ్యాఖ్యానించారు. అయితే కిరణ్‌ ఒక్కరే ఈ వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీ నేతలు, మహిళలపై టీడీపీ సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


Updated On 11 April 2025 1:01 PM GMT
ehatv

ehatv

Next Story