By-Elections in Telangana? : తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమేనా..?
తెలంగాణలో ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఏంటి అనుకుంటున్నారా.

తెలంగాణలో ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఏంటి అనుకుంటున్నారా. అసలు తెలంగాణలో ఎందుకు ఉప ఎన్నికలు అంటే.. బీఆర్‌ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో నడుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విచారణ జరిగే అవకాశం ఉంది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు చూస్తుంటే ఉప ఎన్నికల అంశానికి బలం చేకూరుతోంది. న్యాయమూర్తులే కాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యే వైఖరిని చూస్తే ఉప ఎన్నికలు ఖాయమేనా అన్నట్లు తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని, కాంగ్రెస్‌లో చేరిన మాట అవాస్తవమని అఫిడవిట్ సమర్పించారు. కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవానికి వారు కాంగ్రెస్‌లో చేరింది నిజమే. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌లో ఉన్నామని చెప్తూ అఫిడవిట్ వేశారంటే అర్థం ఏంటి.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
