మహారాష్ట్ర(Maharshtra), జార్ఖండ్‌(Jarkhand) అసెంబ్లీ ఎన్నికల(Assembly elections results) ఫలితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

మహారాష్ట్ర(Maharshtra), జార్ఖండ్‌(Jarkhand) అసెంబ్లీ ఎన్నికల(Assembly elections results) ఫలితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలోనూ, జార్ఖండ్‌లోనూ బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీయే(NDA) కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌(Exist Polls) చెప్పాయి. అయితే వీటిలో మహారాష్ట్ర విషయం నిజమయ్యింది. జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా కాంగ్రెస్‌ పార్టీ(Congress) ఘన విజయం సాధించింది. జార్ఖండ్‌ ఫలతాలు అనూహ్యంగా వచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఘన విజయం సాధించింది. ప్రజలు మరోసారి జేఎంఎంకు పట్టం కట్టారు. జేఎంఎంను కూడా బీజేపీ చీల్చే ప్రయత్నం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవాలని కుటిల యత్నం చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనుకుంది. ఇవన్నీ ప్రజలు గమనించారు. సీఎం హేమంత్‌ సొరెన్‌ను కొన్నాళ్ల పాటు జైల్లో కూడా పెట్టారు. అక్కడ బీజేపీ పాగా వేయాలని విఫల యత్న చేసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ అక్కడ ప్రజలు జేఎంఎంకు పట్టం కట్టారు. గతంలో కంటే ఈసారి ఇండీ కూటమికి ఎక్కువ స్థానాలు, ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. ఈ ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌, ప్రియాంకలకు, బీజేపీ వ్యతిరేకులకు ఆనందం కలిగించి ఉంటాయి. అయితే ఇదే ఆనందం మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి పూర్తిగా ఆవిరయ్యింది. మహారాష్ట్రలో చాలా సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఫలితం జమిలీ ఎన్నికలకు నాంది కాబోతున్నదా? అంటే అవుననే అనిపిస్తోంది. జమిలి ఎన్నికలకు(Jamili elections) వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఆలోచిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(Ramnath kovindh) నేతృత్వంలోని కమిటీ నివేదిక కూడా జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చిన తెలిపింది. ఈ నివేదికను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది కూడా! ఈ రిపోర్ట్‌ ఆధారంగానే కేంద్రం జమిలికి వెళ్లాలని అనుకుంటోంది. 2027లో దేశమంతటా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంటే లోక్‌సభతో పాటు వివిధ రాసష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి.

Updated On 24 Nov 2024 6:40 AM GMT
Eha Tv

Eha Tv

Next Story