హిందువులు ఆవేదన చెందుతుంటే కేంద్ర బీజేపీ(BJP) ఎందుకు మాట్లాడటం లేదు?

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తిరుమల లడ్డూకు(Tirumala laddu) సంబంధించి ఇంత గొడవ జరుగుతుంటే , ఆందోళనలు కనిపిస్తుంటే, హిందువులు ఆవేదన చెందుతుంటే కేంద్ర బీజేపీ(BJP) ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు కేంద్ర బీజేపీ పెద్దలు స్పందించడం లేదు? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) లడ్డూ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో(Chandrababu) తానే స్వయంగా మాట్లాడనని, ప్రాథమిక నివేదిక పంపించమని అడిగాను, పూర్తి నివేదక వచ్చిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇది జరిగి కూడా పది రోజులు దాటింది. ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం పెదవి విప్పడం లేదు? కేవలం రాష్ట్ర నాయకత్వం మాత్రమే లడ్డూ విషయంలో మాట్లాడుతోంది. ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు కదా! రాష్ట్రాలకు సంబంధించిన విషయాలపై రోజూ ప్రెస్‌మీట్‌(Pressmeet) పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇది జాతీయ సమస్య. తిరుమల దేశంలో ఉన్న హిందువులందరికీ పవిత్రమైన ప్రదేశమే! కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అందరూ తిరుమలను దర్శించుకుంటారు. స్వామివారి ప్రసాదం లడ్డూను ఇష్టంగా తింటారు. ఇది నిజంగానే జాతీయ సమస్య! జేపీ నడ్డా వెను వెంటనే స్పందించి ఓ ప్రకటన అయితే చేశారు కదా! ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. హిందుత్వానికి తామే పేటంట్‌ అని చెప్పుకునే, కోట్లాది మంది హిందువులకు తామే రక్షణ అని ప్రకటించుకునే బీజేపీ ఎందుకు దీనిపై శ్రద్ధ చూపడం లేదు? ఒకవేళ చంద్రబాబు అవాస్తవాలు చెబుతూ ప్రజల్లో ఓ రకమైన భయోత్పాతాన్ని సృష్టిస్తే, ఇది తప్పని చెప్పే అధికారం బీజేపీకి ఉంది కదా! ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా భాగస్వామినే కదా! లడ్డూను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంటే, ఇలా చేయకూడదని చెప్పే అధికారం బీజేపీకి కచ్చితంగా ఉంది. కనీసం రాష్ట్ర బీజేపీ నాయకులకు అయినా గమ్మున ఉండండి అంటూ ఆదేశించవచ్చు కదా! పోనీ గత జగన్ ప్రభుత్వమే ఇందుకు కారణమైతే అదైనా చెప్పవచ్చు కదా! జగన్‌దే తప్పంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కోడై కూస్తుంటే, పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టి చెబుతూ ఉంటే, రైళ్లల్లో చిడతలు వాయించుకుంటూ నటనా వైభవాన్ని చాటుకుంటుంటే ఎందుకు జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ కేంద్ర నాయకత్వం మాట్లాడటం లేదు? ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయడం లేదు? కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఒకవేళ తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి కదా! అది ప్రభుత్వం బాధ్యత కూడా! కోట్లాది మంది హిందువుల భావోద్వేగాలతో ముడిపడిన విషయం ఇది. అయినప్పటికీ ఎందుకు మౌనంగా ఉంటుందన్నది అర్థం కావడం లేదు.


Eha Tv

Eha Tv

Next Story