కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్లు కేంద్రం నుంచి అడుగుతున్నాడు.

కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్లు కేంద్రం నుంచి అడుగుతున్నాడు.

రాష్ట్రం అప్పుల్లో ఉంది. మేం 3.5 లక్షల కోట్లు అప్పు ఉందని భావించాం కానీ ఇప్పుడు లక్షల కోట్లు అప్పు ఉందని రేవంత్‌ అంటున్నారని.. ఆరు గ్యారెంటీల అమలుకు కేంద్రం డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారని.. హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అని కిషన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ చేతగాని తనం, రేవంత్ రెడ్డి, రాహుల్‌ గాంధీ చేతగానితనమని కిషన్‌రెడ్డి అంటున్నారు. కేంద్రాన్ని డబ్బులు అడిగితే ఎలా అని కిషన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ఇదే ప్రకటన చేస్తున్నారు. సూపర్‌ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తోందని అంటున్నారు చంద్రబాబు. తెలంగాణలో అయితే తక్కువ అప్పు ఉందనుకున్నాం.. వచ్చి చూసేసరికి అది డబుల్‌ ఉంది అందుకే అమలు చేయలేకపోతున్నామని రేవంత్ అంటున్నారు. ప్రస్తుతానికి ఇది కన్సిడర్ చేసినా కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉందని చంద్రబాబు స్వయంగా చాలా సార్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్లే అని అసెంబ్లీలో ప్రకటించారు. 14 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసి కూడా ఎందుకు హామీలు ఇచ్చినట్లు మరి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది కదా. రేవంత్‌రెడ్డి అసమర్థుడిగా కిషన్‌రెడ్డికి కనిపిస్తే.. చంద్రబాబు మాటలు కిషన్‌రెడ్డికి ఏమనిపించాలి మరి.. రేవంత్‌ను అన్న మాటలు చంద్రబాబుకు వర్తించవా..ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్‌ 'YNR' విశ్లేషణ



ehatv

ehatv

Next Story