తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా ఉండాలని కోరుకున్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా ఉండాలని కోరుకున్నాం. భవిష్యత్లో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎలాంటి వివాదం ఉండకూడదని కోలుకున్నాం. లడ్డూ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు ఇలా కోరుకున్నాం. రాజకీయపార్టీలు తిరుమలను రాజకీయక్షేత్రంగా మార్చేశాయి. రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశాయి. రాజకీయపరమైన జోక్యం వల్ల ఇది వివాదాలకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని రాజకీయపరమైన జోక్యం వద్దని కోరుకున్నాం. టీటీడీ బాధ్యతలను మఠాధిపతులకో, పీఠాధిపతులకో ఇవ్వాలని కోరుకున్నాం. కనీసం టీటీడీ చైర్మన్ పదవిని ఏ గరికపాటికో, ఏ చాగంటికో ఇవ్వాలని కోరుకున్నాం. కానీ చైర్మన్గా బీఆర్నాయుడిని నియమించారు. కానీ ఎన్నడూ లేని విధంగా టీటీడీ కారణంగా ప్రాణాలు పోవడం చూస్తున్నాం. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!