బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్‌ సాగుతూ వస్తోంది. టీవీ సీరియల్‌ను తలపిస్తున్నది.

బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్‌ సాగుతూ వస్తోంది. టీవీ సీరియల్‌ను తలపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల(EVM) అంశంలో ఏదో జరిగిందంటూ పెద్ద పోరాటమే చేశారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఈవీఎంల రీవెరిఫికేషన్‌ కోసం కోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే రీవెరిఫికేషన్‌ సాధ్యం కాదని, కావాలంటే మాక్‌ పోలింగ్‌ను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. సుప్రీం కోర్టు(Suprem Court) చెప్పింది ఇది కాదని, రీవెరిఫికేషన్‌ అంటే ఈవీఎంలో ఓట్లు, వీవీ ప్యాట్స్‌లలో ఉన్న ఓట్లు సరిపోయాయా లేదా అన్నది చెక్‌ చేయాలని బాలినేని చెప్పారు. మాక్‌ పోలింగ్‌లో ఏ విషయమూ తెలియదని అన్నారు. ఆయన ఇంకా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో వీవీ ప్యాట్స్‌ను తాము కాల్చేశామని చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పింది ఎన్నికల సంఘం. ఈవీఎం అంశంలో ఏదో జరిగిందన్నది ఎన్నికల సంఘం తీరుతెన్నులు చూస్తే అర్థమవుతోంది. బాలినేని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP)తరఫున లీగల్‌గా ఫైట్‌ చేస్తున్న వ్యక్తిగా కనిపించారు. బాలినేని చేస్తున్న పోరాటం వైసీపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపిందనే చెప్పొచ్చు. నేతలలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే గత కొంతకాలంగా బాలినేని పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. తన పోరాటానికి పార్టీ వైపు నుంచి సపోర్ట్‌ లేదని చాలా సార్లు బాలినేని చెప్పుకొచ్చారు. మొత్తానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. రేపో ఎల్లుండో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన జనసేన(Janasena)లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనలో బాలినేని చేరకుండా ఆపుతున్నారు కొందరు. అలా ఆపుతున్నది ఎవరు? ఎందుకు ఆపుతున్నారు? ఈ వీడియోలో చూద్దాం.



ehatv

ehatv

Next Story