ఒంగోలు ఈవీఎంల గొడవ ఏమిటి? చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కొంత అయోమయం కూడా ఉంది.

ఒంగోలు ఈవీఎంల గొడవ ఏమిటి? చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కొంత అయోమయం కూడా ఉంది. ఒంగోలు(Ongole)లో అసలు ఏమి జరుగుతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy)ఏం ఆశిస్తున్నారు? ఆయన ఎన్నికల సంఘాన్ని ఏం కోరుతున్నారు? ఎన్నికల సంఘం ఏమి చెబుతుంది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ(TDP) నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP)కు ఘోర పరాజయం ఎదురయ్యింది. వైసీసీకి ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. కచ్చితంగా గెలిచి తీరుతారు అని అనుకున్న వారు కూడా ఓడిపోయారు. అలాంటివారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. ఓటమి పట్ల ఆయనకు కూడా కొన్ని అనుమానాలు కలిగాయి. ఈవీఎం(EVM)లో ఏదో జరిగే ఉంటుందన్నది బాలినేని అనుమానం! అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు రోజున అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక అయిదు ఈవీఎంలను లెక్కించే అవకాశం ఉంటుంది. ఈవీఎంలలో వచ్చిన ఓట్లకు, వీవీ ప్యాట్లకు మధ్య వ్యత్యాసం ఉందా? లేదా? అన్నది కౌంటింగ్‌ ముగిసన తర్వాత వెంటనే ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించి ఆ అయిదు ఈవీఎంలకు సంబంధించి వీవీ ప్యాట్లు, ఈవీఎంలలో ఉన్న ఓట్లను సరి చూసుకునే అవకాశం ఉంది. కానీ గడచిన ఎన్నికల సందర్బంగా చాలా పెద్ద ఎత్తున కూటమి విజయం నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ వ్యవహారాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌ను కలిశారు. నిబంధనల మేరకు కౌంటింగ్‌ కోసం కట్టాల్సిన రుసుమును కూడా బాలినేని చెల్లించారు. డబ్బు కట్టిన తర్వాత ఎన్నికల సంఘం చాలా నిర్లిప్తంగా మాట్లాడింది. దీని వల్ల ఏమీ తేలదని, వెరిఫికేషన్ కోసం ఎందుకు పట్టుబడుతున్నారు? మీ ఆలోచనను వెనక్కి తీసుకోండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని చెప్పారు! వెరిఫకేషన్‌ అవసరం లేదని చెప్పండి అంటూ ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు తనను కోరారని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంతేకాదు విజయనగరం (vijayanagaram)జిల్లాకు చెందిన ఎంపీగా పోటీచేసిన చంద్రశేఖర్‌(ChandraShekar)కు కూడా ఎన్నికల సంఘం నుంచి ఇదే తరహా అనుభవం ఎదురయ్యింది. ఈయనను కూడా వెరిఫికేషన్‌ రిక్వెస్ట్‌ను వెనక్కి తీసుకోండి అని ఎన్నికల సంఘం అధికారులు కోరారట! బాలినేని శ్రీనివాస రెడ్డి ఏమైనా సరే ముందుకే వెళదామని డిసైడయ్యారు. వెరిఫికేషన్‌ అంటే సుప్రీంకోర్టు(Supreme Court) చెప్పిన దాని ప్రకారం ఆయా పోలింగ్‌ బూత్‌(Polling Booth)లలో ఉన్న ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఆ ఓట్లల్లో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి? ఆ పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ల స్లిప్స్‌ సరిపోయాయా? లేదా? అన్నది చెక్‌ చేయాల్సి ఉంటుంది. ఫర్‌ ఎగ్జాంపుల్‌ వైసీపీకి ఓ వంద ఓట్లు, టీడీపీకి ఓ వంద ఓట్లు, మిగతా పార్టీలకు ఓ 50 ఓట్లు వచ్చాయనుకుందాం! ఈవీఎంలలో కనిపిస్తున్న ఈ నంబర్‌ వీవీ ప్యాట్ల స్లిప్పులతో సమానంగా ఉండాలి. ఒకట్రెండు కూడా తేడా రాకూడదు. వెరిఫికేషన్‌ అంటే ఇది! కానీ ఎన్నికల సంఘం మాత్రం వెరిఫికేషన్‌ను మాక్‌ పోలింగ్‌గా మార్చింది. మాక్‌పోలింగ్ అంటే ఈవీఎంలు తయారు చేసిన బెల్‌ సంస్థ ప్రతినిధులు నియోజకవర్గానికి వస్తారు. ఒంగోలుకు సంబంధించిన 12 ఈవీఎంలు ట్యాంపర్‌ (EVM Tampering)అయ్యాయా లేదా అన్నది టెక్నికల్‌గా వారు చెక్‌ చేస్తారు. తమ నిర్ణయాన్ని కోర్టుకు చెబుతారు. ఈ పర్టిక్యులర్‌ ఈవీఎంలు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవడం కోసం బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సంబంధించిన వ్యక్తుల ముందే చెక్‌ చేస్తారు. ఇక్కడే ఎన్నికల సంఘం తిరకాసు ఉంది. ఈసీ చర్యలు అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. ఇంతకీ ఈసీ ఏం చేస్తున్నది? బాలినేని రిక్వెస్ట్ మేరకు వెరిఫికేషన్ ఎందుకు చేయడం లేదు? మాక్‌ పోలింగ్‌ వల్ల ఏమీ తేలదన్న సంగతి అందరికీ తెలుసు. ఇక్కడే ప్రజలకు పలు సందేహాలు కలుగుతున్నాయి. ఆ అనుమానాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం!


ehatv

ehatv

Next Story