వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP)నాయకుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి(Balineni Srinivas Reddy) ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP)నాయకుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి(Balineni Srinivas Reddy) ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈవీఎంల(EVM)కు సంబంధించి ఆయన చేస్తున్న పోరాటం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తోంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనుమానిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ఎన్నికలలో ఈవీఎంలలో ఏదో జరిగిందనే అనిపిస్తున్నది. అనుమానాలు బలపడే విధంగా ఎన్నికల సంఘం వ్యవహారశైలి ఉన్నది. తన నియోజకవర్గంలో కొన్ని బూత్‌లలో ఈవీఎంల ట్యాంపరింగ్‌ (EVM Tampering)జరిగిందనేది బాలినేని అభియోగం. ఈవీఎంల పనితీరుపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ బాలినేని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. మొత్తం అయిదు శాతం పోలింగ్‌ బూత్‌లలో రీ వెరిఫికేషన్‌ను కోరాడు బాలినేని. అయితే రీ వెరిఫికేషన్‌ అంటే సుప్రీం కోర్టు(Supreme Court) చెప్పిందొకటి. ఎన్నికల సంఘం చేస్తున్నదొకటి అంటూ బాలినేని శ్రీనివాస రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది. బాలినేని చేస్తున్న న్యాయపోరాటం వైసీపీలో ఉత్సాహాన్ని నింపింది. వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy)కాంగ్రెస్‌ పార్టీని వదిలిపెట్టి సొంతంగా పార్టీ పెట్టుకున్న సమయంలో అప్పుడు క్యాబినెట్‌లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిని కూడా విచిడిపెట్టి జగన్‌ వెంట నడిచారు. జగన్మోహన్‌రెడ్డికి ఈయన దగ్గర బంధువు కూడా! అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ పక్క ఈవీఎంలపైన పోరాడుతూనే మరో పక్క పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా(Prakasham)లో ఈ మాటే వినిపిస్తోంది. బాలినేని పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారనే చర్చ ఆయన సన్నిహిత వర్గాలలో విపరీతంగా జరుగుతోంది. బాలినేని ఆల్‌రెడీ నిర్ణయం తీసేసుకున్నారని కూడా అంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan kalyan)ను కలవనున్నారని అంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరబోతున్నారని చెప్పుకుంటున్నారు.

Updated On 22 Aug 2024 1:00 PM GMT
ehatv

ehatv

Next Story