Journalist YNR : పాత ఐఏఎస్‌లు పనికిరారా.. కొత్తవాళ్లే కావాలా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి మరిన్ని ఐఏస్‌లు కావాలని కేంద్రాన్ని కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి మరిన్ని ఐఏస్‌లు కావాలని కేంద్రాన్ని కోరుతోంది. కనీసం నలుగురు ఐఏఎస్ అధికారులు, నలుగురు ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖను కోరుతోంది. లేదా డిప్యుటేషన్‌పై అయినా కొంత మందిని కేటాయించాలని కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ల కొరత ఉన్నమాట వాస్తవం. పాలనలో ఇబ్బందులు పడుతున్నాం.. పరిపాలన సక్రమంగా సాగాలి అనుకుంటే కొత్తగా కేంద్రం ఐఏఎస్‌లను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం ఏపీకి కొత్త ఐఏఎస్‌లను కేటాయించాలంటే కొత్త రిక్రూట్మెంట్ జరగాలి. కొత్తగా రిక్రూట్మెంట్ అయినవారు కూడా తొలుత డైరెక్ట్ కలెక్టర్ స్థానానికి రాలేరు. డిప్యూటీ కలెక్టరో, జాయింట్ కలెక్టరో మరేదో పోస్టుల్లో పనిచేస్తారు. కనీసం డిప్యుటేషన్‌పైన అయినా ఐఏఎస్‌లను తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన జరగాలంటే ఐఏఎస్ అధికారుల పాత్ర చాలా కీలకం. ఒక ఐఏఎస్ అధికారి జిల్లాలో ఉన్న ఉద్యోగులను, యంత్రాంగాన్ని శాంతిభద్రతలను చూసుకుంటారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. లేదా అడ్మినిస్ట్రేషన్ సరిగా నడవాలన్నా ఐఏఎస్‌లదే కీలక పాత్ర. శాఖలు నడవాలన్నా, జిల్లాలు నడవాలన్నా వాళ్లు లేనిదే పని జరగదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పాత అధికారులను ఎందుకు వాడుకోలేకపోతున్నాం. ఎందుకు పాత అధికారులు పనిచేయలేరా.. ఎందుకు వాళ్లను ఉపయోగించుకోలేకపోతున్నాం.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..
