వాలంటీర్ల అంశానికి సంబంధించిన వీడియో ఇది. వాలంటీర్ల గురించి గతంలో కూడా చాలా వీడియోలు చేశాం. ఈరోజు మళ్లీ చేస్తున్నాం.

వాలంటీర్ల అంశానికి సంబంధించిన వీడియో ఇది. వాలంటీర్ల గురించి గతంలో కూడా చాలా వీడియోలు చేశాం. ఈరోజు మళ్లీ చేస్తున్నాం.

ఈరోజు శాసనమడలిలో జరిగిన చర్చ సందర్భంగా మీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువస్తున్నాం. అయితే వాలంటీర్లు ఎవరికీ కాని వారయ్యారు. ఏ రాజకీయపార్టీకి సంబంధం లేని వారయ్యారు. వాలంటీర్ల సేవలను సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ కుటుంబం నాలుగేళ్లపాటు వాలంటీర్ల సేవలు పొందారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు ఎవరూ మర్చిపోరు.

ప్రతీ ఇంటికి ప్రభుత్వం చేరిదంటే కారణం వాలంటీర్లే. అయితే వాలంటీర్లపై ఎన్నికల ముందు కొన్ని విమర్శలు వచ్చాయి. ఏదో ఒక రాజకీయపార్టీకి లబ్ది చేకూరుస్తారని విమర్శలు చేశారు. 2024 అసెంబ్లీ కంటే ముందు వాలంటీర్ల గురించి మీడియా అనేక వార్తలు రాసింది. మొదట్లో వాలంటీర్లపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. కరోనా తర్వాత వాలంటీర్లపై విమర్శలు చేసేందుకు వెనుకాడారు. ఎన్నికల కంటే ముందు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా ఆయన హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. అంతేకాకుండా వాలంటీర్లకు ఇప్పుడు ఇస్తున్న రూ.5 వేలకు మరో ఐదు వేలు కలిపి 10 వేల వేతనం ఇస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి.. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వాలంటీర్లను పట్టించుకోవడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే అసలు వాలంటీర్ల వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది.. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని వాదిస్తున్నారు. ఇది వాలంటీర్లను చీట్‌ చేయడం కాదా.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story